శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే..?
పుష్ప 2 మూవీ బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి ఈ బాలుడు కిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని వెల్లడిస్తూ.. హెల్త్ బులెటిన్ విడుదల చేశారు కిమ్స్ వైద్యులు.
శ్రీతేజ్ ప్రస్తుతం వెంటిలేటర్ అవసరం లేకుండానే ఆక్సిజన్ తీసుకున్నట్టు చెప్పారు కిమ్స్ వైద్యులు. అలాగే ఎండోస్కోపిక్ గ్యాస్ట్రోస్టమీ ప్రక్రియ ద్వారా శ్రీతేజ పొట్టలోకి ఆహారం పంపిస్తున్నామని చెప్పారు. అంతేకాదు ఇప్పటికీ కుటుంబసభ్యులను శ్రీతేజ గుర్తించలేకపోతున్నాడని.. అతడి శరీర కదలికల కోసం ఫిజియోథెరపీ కూడా చేస్తున్నామని వైద్యులు హెల్త్ బులెటిన్‌తో తెలిపారు. అయితే ఓ నెల క్రితం శ్రీతేజను కిమ్స్‌కెళ్లి పరామర్శించిన బన్నీ వాసు… ఆ బాలుడికి మెరగైన వైద్యం అందించాలని డాక్టర్స్‌ను కోరాడు. అవసరం అయితే ఫారెన్‌కు తీసుకెళ్లడానికి వెనకాడను అన్నట్టు మీడియాతో చెప్పారు. ఈ క్రమంలోనే శ్రీతేజ ఆరోగ్యం కాస్త మెరుగుపడుతున్న డాక్టర్లు చెప్పడం… ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిద్రలేమితో బాధపడతున్నారా.. ఇదిగో పరిష్కారం..!
పెళ్లి వేదికపైనే రెచ్చిపోయిన వధూవరులు.. వీడియో చూస్తే
చావా సినిమా ఎఫెక్ట్ బంగారం కోసం ఆ కోట చుట్టూ తవ్వకాలు
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

