తెల్లారితే పెళ్లి..! అంతలోనే.. పెళ్లి కుమారుడి ఆత్మహత్య
అనాలోచితంగానో లేక క్షణికావేశంలోనూ కొంతమంది చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వారి తీసుకునే ఆ నిర్ణయాల వల్ల కొన్ని కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోతాయి. తాజాగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అది కూడా ఎలాంటి టైమ్‌లోనో తెలిస్తే అయ్యో పాపం అంటారు. ఆ రోజు ఆ ఇళ్లంతా ఎంతో సందడిగా ఉంది. ఎందుకంటే.. తెల్లారితే ఆ ఇంట్లో పెళ్లి.
తమ కుమారుడికి పెళ్లి అవుతుందనే సంతోషంలో ఆ తల్లిదండ్రులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. చుట్టాలంతా రావడంతో ఇంట్లో ఎటు చూసినా సందడే. అప్పటికే పెళ్లి పనులన్నీ జరిగిపోయాయి. ఆ రాత్రి గడిస్తే మంగళవాయిద్యాల మధ్య నూతన జంట ఒక్కటి కానుంది. కానీ, అంతలోనే ఆ పెళ్లి కొడుకు ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. పెళ్లికి ఒక్క రోజు ముందు ఆత్మహత్య చేసుకున్నాడు. కన్నీళ్లు పెట్టించే ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రామచంద్రంపేటలో చోటు చేసుకుంది. మృతుడి పేరు కిరణ్. తెల్లారితే పెళ్లి పెట్టుకొని ఇంత కఠిన నిర్ణయం తీసుకొని, తనువు చాలించాడు. పెళ్లి కొడుకుగా మారి పెళ్లి పీటలు ఎక్కుతాడనుకున్న కుమారుడు, శవమై పాడెక్కుతుంటే ఆ కన్నవాళ్లు గుండెలు పగిలేలా రోదించారు. పెళ్లి చూద్దామని వచ్చిన బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. అయితే కిరణ్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనే విషయాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కిరణ్ ఆత్మహత్యతో అటు వధువు ఇంట్లో కూడా తీవ్ర విషాదం నెలకొంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

