23 December 2024
Pic credit -Social Media
TV9 Telugu
పాముల గురించి ఆలోచించినప్పుడల్లా మన మనసులో వచ్చే మొదటి ఆలోచన ఒకటే.. ఇవి భూమి మీద అతి పెద్ద జంతువు అయిన ఏనుగును కూడా విషంతో చంపగలవి అని.
అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. అందులో నాలుగు ప్రమాదకరమైన నాగు పాములు ఒకదానితో ఒకటి పోరాడుతున్నాయి. అది చూసి ఆశ్చర్యపోతున్నారు.
నాలుగు నాగుపాములు రెండు గ్రూపులుగా విడిపోయి పోరాడుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి, ఈ దృశ్యం ఎంత ఉత్కంఠభరితంగా ఉందో.. అంతే ప్రమాదకరం కూడా.
ఈ వీడియో క్లిప్ చూస్తుంటే నలుగు నాగు పాములు తమ బలాన్ని ప్రదర్శిస్తూ ఒక దానిపై ఒకటి దాడి చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది.
అయితే ఈ నాలుగు పాముల మధ్య జరిగిన కోట్లతో ఏ పాము శక్తివంతమైన పాము అనే విషయం చెప్పలేం. ఎందుకంటే ఈ పాముల మధ్య జరిగిన యుద్ధం ముగింపు చూపించలేదు.
పాముల మధ్య అది కూడా నాలుగు పాములు పోరాటం ఇప్పటి వరకూ చూడలేదు. ఇది ప్రకృతి ఆడే ఆట.. ఆధిపత్య కోసం పాముల మధ్య అద్భుతమైన పోరాటం.