ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ
ICC ఛాంపియన్స్ ట్రోఫీని ” మినీ వరల్డ్ కప్ ” అని కూడా పిలుస్తారు. ” ఛాంపియన్స్ ట్రోఫీ ” ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్. 1998లో మొదలైంది. ఇందులో వన్డే ఫార్మాట్‌లో టోర్నీని నిర్వహిస్తుంటారు. మొదటి ఛాంపియన్స్ ట్రోఫీ బంగ్లాదేశ్‌లో జూన్ 1998లో నిర్వహించారు. ప్రస్తుతం 8 ఎడిషన్‌లు పూర్తయ్యాయి. ప్రస్తుత ఫార్మాట్ క్రికెట్ ప్రపంచ కప్ గత ఎడిషన్‌లో జరిగే క్వాలిఫికేషన్ దశను కలిగి ఉంటుంది. టోర్నమెంట్ దశకు ఏ జట్లు అర్హత సాధించాలో ఇది నిర్ణయించనుంది. ప్రపంచ కప్‌లో (ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిచ్చిన దేశంతో సహా) మొదటి ఎనిమిది ర్యాంక్‌లో ఉన్న జట్లు టోర్నమెంట్‌కు బెర్త్‌ను ఖాయం చేసుకుంటాయి. ఆస్ట్రేలియా , భారత్‌లు రెండుసార్లు టోర్నీని గెలుపొందగా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక , వెస్టిండీస్, పాకిస్థాన్‌లు ఒక్కోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచాయి. ఇంగ్లండ్‌లో జరిగిన 2017 టోర్నమెంట్‌లో పాకిస్తాన్ ఛాంపియన్‌గా నిలిచింది . 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లో జరుగుతుంది.