Team India: ఏంటీ! ఈ టీమిండియా క్రికెటర్ సినిమాల్లోనూ నటించాడా? ఎవరో గుర్తు పట్టారా?
సాధారణంగా రిటైరైన క్రికెటర్లు ఎక్కువగా రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ అడుగు పెడుతుంటారు. ఈ మధ్యన శిఖర్ ధావన్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ తదితర రిటైరైన క్రికెటర్లు టీవీషోలు, సినిమాల్లో కనిపించారు. అయితే ఈ టీమిండియా క్రికెటర్ అరంగేట్రానికి ముందే ఓ సినిమాలో మెరిశాడు.

సినిమాలు, క్రికెట్ కు అవినాభావ సంబంధం ఉంది. ఇక మన దేశంలో అయితే సినిమా స్టార్లకు, క్రికెటర్లకు ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అలా సినిమాలు, క్రికెట్.. రెండింటితోనూ సంబంధమున్న ఈ టీమిండియా క్రికెటర్ ఎవరో గుర్తు పట్టారా? ప్రస్తుతం ఈ ప్లేయర్ పేరు తెగ వినిపిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలోనూ ఈ క్రికెటర్ పేరు బాగా మార్మోగిపోతోంది. ఈ క్రమంలోనే అతని గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విషయమేమిటంటే.. టీమిండియాలోకి రాక ముందు ఈ క్రికెట్ ప్లేయర్ ఒక తమిళ సినిమాలో నటించాడు. ఓ క్లబ్ క్రికెటర్ పాత్రలో తళుక్కున మెరిశాడు. పైన కనిపిస్తోన్న ఫొటోలు అవే. మరి ఈ టీమిండియా క్రికెటర్ ఎవరో గుర్తు పట్టారా? అతను మరెవరో కాదు ఇటీవల ముగిసిన ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెల్చుకోవడంలో కీలక పాత్ర పోషించిన మిస్టరీ స్పిన్నర్ వరుణ చక్రవర్తి. విష్ణు విశాల్ హీరోగా 2014లో తమిళంలో రిలీజైన జీవా అనే సినిమాలో వరుణ్ చక్రవర్తి ఓ కీలక పాత్ర పోషించాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో వరుణ్ హీరో క్రికెట్ టీమ్ లో మెంబర్ గా కాసేపు కనిపించాడు. ఈ మూవీలో తెలుగమ్మాయి శ్రీ దివ్య హీరోయిన్ గా నటించడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా యూట్యూబ్‌లో నూ ఫ్రీగా అందుబాటులో ఉంది. జీవా మూవీతో పాటు కోకూ విత్ కోమలి అనే టీవీ షోలో కూడా అతిథిగా వరుణ్ చక్రవర్తి పాల్గొన్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో సంచలన ప్రదర్శనతో టీమిండియా విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు వరుణ్ చక్రవర్తి. ఈ టోర్నీలో కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన వరుణ్ ఏకంగా తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో రెండో స్థానంలో నిలిచాడు.
ఛాంపియన్స్ ట్రోఫీతో వరుణ్ చక్రవర్తి..
View this post on Instagram
అంతకు ముందు ఇంగ్లండ్, సౌతాఫ్రికా సిరీస్‌ల్లోనూ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడీ మిస్టరీ స్పిన్నర్. ఈ ప్రదర్శనతో వరుణ్ చక్రవర్తి ఇక టీ20లు, వన్డేల్లోనూ టీమిండియా రెగ్యులర్ ప్లేయర్ గా మారిపోయాడని క్రికెట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..