Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: బర్త్ డే పార్టీ చేసుకోవాలంటే భయపడిపోతారు.. ఓటీటీలో ఈ సూపర్ థ్రిల్లర్‌ తెలుగు సినిమాను చూశారా?

సాధారణంగా బర్త్ డే పార్టీ అంటే ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. అయితే ఆ పార్టీ ఎంజాయ్ మెంట్ కాస్త శ్రుతి మించి ఓ మనిషి నిండు ప్రాణాన్ని ఎలా బలి తీసుకుందనే పాయింట్ తో ఓ నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.

OTT Movie: బర్త్ డే పార్టీ చేసుకోవాలంటే భయపడిపోతారు.. ఓటీటీలో ఈ సూపర్ థ్రిల్లర్‌ తెలుగు సినిమాను చూశారా?
OTT Movie
Follow us
Basha Shek

|

Updated on: Mar 14, 2025 | 2:18 PM

ప్రస్తుతం ఓటీటీల్లో అన్ని రకాల సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. లవ్, కామెడీ, రొమాంటిక్, ఫ్యామిలీ, హార్రర్, సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్.. ఇలా రకరకాల జానర్ల సినిమాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో ఎక్కువ క్రైమ్, సస్పెన్స్, హార్రర్ థ్రిల్లర్ సినిమాలకే ఆడియెన్స్ ఆదరణ ఉంటోంది. ఓటీటీలు కూడా ఎక్కువగా ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలనే స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. అలాగనీ ఇదేమీ ఇంగ్లిష్ మరే భాషా సినిమానో కాదు. అచ్చమైన తెలుగు సినిమా. ఒక బర్త్ డే పార్టీలో ఫ్రెండ్ షిప్ పేరుతో వేసే వెకిలి వేషాలు ఓ మనిషి నిండు ప్రాణాలను ఎలా బలి తీసుకున్నాయి అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఇక సినిమాలోని ట్విస్టులు మాత్రం నెక్ట్స్ లెవెల్ లో అని చెప్పవచ్చు. అందుకే ఈ మూవీ ఓటీటీలో రిలీజైనప్పుడు రికార్డ్ వ్యూస్ వచ్చాయి. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. ఇది నిజంగా జరిగిన సంఘటనే. ఈ సినిమా దర్శకుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటననే కథగా మలిచి ఈ మూవీని తెరకెక్కించాడు. పుట్టినరోజు వేడుకల్లో ఓ స్నేహితుడు ఎలా చనిపోయాడు? ఇండియాలో ఉన్న అతని తల్లిదండ్రులను ఎలా మ్యానేజ్ చేశారు? అమెరికాలో ఉన్న శిక్షల నుంచి ఎలా తప్పించుకున్నారు? అనేది ఈ సినిమాలో చూపించారు డైరెక్టర్. అయితే క్లైమాక్స్ లో ఓ పెద్ద ట్విస్టే ఇచ్చారు. అప్పటివరకు క్రైమ్ థ్రిల్లర్ సినిమా కాస్తా రివేంజ్ డ్రామా గా మారిపోతుది. మరి ఆ ట్విస్ట్ ఏంటన్నదే ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇంతకీ ఆ సినిమా ఏంటనుకుంటున్నారా? విరూపాక్ష సినిమాతో భయపెట్టిన రవికృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ది బర్త్ డే బాయ్.

విక్కీ దాసరి తెరకెక్కించిన ఈ సూపర్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో రాజీవ్ కనకాల ప్ర‌మోదిని, వాకా మ‌ని, రాజా అశోక్‌, వెంక‌టేష్, సాయి అరుణ్‌, రాహుల్, సమీర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గతేడాది జులై 19న థియేటర్లలో ఈ మూవీ విడుదలైంది. అయితే పేరున్న నటీనటులు లేకపోవడం, ప్రమోషన్లు లేకపోవడంతో ఈ మూవీ పెద్దగా ఆడలేదు. అయితే ఆగస్టు 9 నుంచి ఈ మూవీ ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. అంతే రికార్డు వ్యూస్ వచ్చాయి. సినిమాలో ఎవరూ ఊహించని ట్విస్టులు ఉండడంత, ఆద్యంతం ఆసక్తికరంగా సాగడంతో ఈ సినిమాను చాలా మంది చూసేసి తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ మూవీ చూశాక బర్త్ డే పార్టీ చేసుకోవాలంటేనే భయంగా ఉందంటూ నెట్టింట కామెంట్స్ పెట్టారు. మరి మీరు ఈ సినిమాను చూశారా? లేకపోతే ఆహో ఓటీటీలో ఉంది సరదాగా ఓ లుక్కేసుకోండి.

ఇవి కూడా చదవండి

ఆహాలో స్ట్రీమింగ్..

ది బర్త్ డే బాయ్ సినిమా ట్రైలర్..