Tollywood: ఇది అరాచకం మావా.. భార్యను వదిలేసి ట్రాన్స్‌జెండర్‌తో ప్రేమ.. ఓటీటీలో రచ్చ చేస్తోన్న బోల్డ్ మూవీ..
ఇటీవల ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో సినీప్రియులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. హారర్, మర్డరీ, మిస్టరీ థ్రిల్లర్, రొమాంటిక్ జానర్ చిత్రాలకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. తాజాగా ఓటీటీలో రచ్చ చేస్తున్న రొమాంటిక్ బోల్డ్ మూవీ గురించి తెలుసుకుందామా.

ప్రస్తుతం ఓటీటీలో రచ్చ చేస్తోన్న సినిమా జాయ్ ల్యాండ్. రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం పాకిస్తానీ సినిమా. డైరెక్టర్ సైమ్ సాదిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అపూర్వ గురు చరణ్, సమద్ సుల్తాన్ ఖూసత్, సబిహ సుమర్, లారెన్ మన్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రంలో అలీనా ఖాన్, అలీ జునెజో, రస్తి ఫరూఖ్ , సర్వత్ గిలానీ, సోహైల్ సమీర్, సల్మాన్ పీర్, సానియా సయ్యద్ కీలకపాత్రలు పోషించారు. ఎల్జీబీటీక్యూ కాన్సెప్ట్ ప్రధానంశంగా తెరకెక్కిన ఈ సినిమాను మొదటగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. విడుదలకు ముందే అవార్డ్స్ అందుకున్న ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి 7.6 రేటింగ్ ఉంది. అలాగే రొటెన్, టొమాటోస్ నుంచి 98 శాతం ఫ్రెష్ కంటెంట్ గా పేరు తెచ్చుకుంది ఈ సినిమా.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఉర్దూ భాషలో ఈ సినిమాను ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. ఊహించని ట్విస్టులు.. రొమాంటిక్ సీన్లతో ఓటీటీలో రచ్చ చేస్తుంది ఈ బోల్డ్ మూవీ.
కథ విషయానికి వస్తే..
సలీం, హైదర్ ఇద్దరు అన్నదమ్ములు. హైదర్ కు ముంతాజ్ భార్య. ఆమె జాబ్ చేస్తుంటుంది. కానీ హైదర్ మాత్రం ఖాళీగా ఉండడంతో అందరు చులకనగా చస్తారు. దీంతో అదే సమయంలో బీబా అనే ట్రాన్స్ జెండర్ ప్రేమలో పడతాడు హైదర్. బీబా మత్తులోనే తిరుగుతుంటాడు.. ఆ తర్వాత హైదర్ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయి… ? అతడి భార్య ముంతాజ్ ఏమైందీ ? హైదర్, బీబా లవ్ స్టోరీలో ఏం జరిగింది ? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..