AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holiday: హోలీ సెలవు మారిందా..? బుధవారం బ్యాంకులు మూసి ఉంటాయా?

Bank Holiday: రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి బ్యాంకు సెలవులు ఉంటాయని గుర్తించుకోండి. అయితే మార్చి 3న హోలీ. కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంది. మరి మార్చి 4న బుధవారం కూడా బ్యాంకులకు సెలవు ఉంటుందా? ఒక వేళ..

Bank Holiday: హోలీ సెలవు మారిందా..? బుధవారం బ్యాంకులు మూసి ఉంటాయా?
Bank Holidays in May 2026: మే నెలలో బ్యాంకు లావాదేవీలు నిర్వహించే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక సమాచారం అందించింది. పండుగలు, వారాంతపు సెలవుల కారణంగా వచ్చే నెలలో మొత్తం 9 రోజుల పాటు బ్యాంకులు పని చేయవు. ఈ సెలవుల జాబితాను గమనించకుండా ప్లాన్ చేసుకుంటే ఇబ్బందులు తప్పవు.
Subhash Goud
|

Updated on: Mar 03, 2026 | 4:59 PM

Share

Bank Holiday: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రతి నెల బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. అయితే ఆర్బీఐ విడుదల చేసిన జాబితా ఆయా రాష్ట్రాల బట్టి ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటే మరి కొన్ని రాష్ట్రాల్లో తెరిచే ఉంటాయి. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి బ్యాంకు సెలవులు ఉంటాయని గుర్తించుకోండి. అయితే మార్చి 3న హోలీ. కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంది.

మరి మార్చి 4న బుధవారం కూడా బ్యాంకులకు సెలవు ఉంటుందా? ఒక వేళ ఉంటే ఏయే రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకుందాం.

మార్చి 3 తెలుగు రాష్ట్రాలలో ఈ హోలీ పండుగ వేడుకలు జరుపుకుంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా రేపు మార్చి 4వ తేదీన హోలీ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ కూడా ఈరోజు బంద్ ఉంది. అయితే రేపు కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు బంద్ ఉంటాయి.

ఇది కూడా చదవండి: Multibagger: సమయం లేదు మిత్రమా..! ఏడాదిలోనే 220% లాభం.. ఇప్పుడు 1 షేర్ కు 4 షేర్లు ఉచితం..

ఆర్‌బీఐ బ్యాంక్ హాలిడే ఎప్పుడు?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) షెడ్యూల్ ప్రకారం మార్చి 3, 4 తేదీల్లో కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్ ఉంటాయి. హోలీ సందర్భంగా ఈ సెలవు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో దక్షిణాదినా హోలీ మార్చి 3న జరుపుకుంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం మార్చి 4 అంటే రేపు ఈ వేడుక చేస్తున్నారు.

బుధవారం ఎక్కడ బ్యాంకులు బంద్ ?

మార్చి 4వ తేదీ మొత్తంగా 18 నగరాల్లో ఈ బ్యాంకులు మూసి ఉండనున్నాయి. అహ్మదాబాద్, ఐజ్వాల్, అగర్తలా, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రాడూన్, గ్యాంగ్ టాక్, జమ్ము, కాన్పూర్, లక్నో, ఢిల్లీ, పాట్నా, రాయపూర్‌లో బ్యాంకులకు సెలవు. ఈ ప్రాంతాల్లో ముందుగా హోలికా దహనం సాయంత్రం 6:22 గంటల నుంచి రాత్రి 8:50 మధ్యలో ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఇక మార్చ 4వ తేదీన హోలీ వేడుకలు ఈ ప్రాంతాల్లో జరుపుకోనున్నారు. బ్యాంకులు కూడా బంద్ ఉంటాయి.

ఇది కూడా చదవండి: Bank Deposit: ఈ బ్యాంకులో మీరు రూ.1 లక్ష డిపాజిట్‌ చేస్తే రూ.41,478 రూపాయల వడ్డీ!

Best Selling Cars: భారతదేశంలో అత్యధికంగా అమ్మడైన కారు ఏదో తెలుసా..? బెస్ట్‌ సెల్లింగ్‌ కార్ల జాబితా విడుదల

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us