AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం కొట్టుకున్నారు భయ్యా.. పిడి గుద్దుల హోళీ.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా..?

మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మాత్రం హోలీ పండుగ అంటే కేవలం రంగులే కాదు.. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటేనే అక్కడ పండుగ పూర్తవుతుంది. దశాబ్దాలుగా ఈ వింత ఆచారం కొనసాగుతుంది. వెల్దుర్తి మండల కేంద్రంలో హోలీ వేడుకలు అంటే మిగతా ఊర్ల కంటే కాస్త భిన్నం. రాష్ట్రమంతా ఒకరోజు హోలీ జరుపుకుంటే.. వెల్దుర్తిలో మాత్రం ఒకరోజు ముందే రంగుల వేడుక మొదలవుతుంది. ఉదయం పూట దైవ ప్రార్థనలతో ప్రారంభమయ్యే ఈ వేడుకలు.. రాత్రి అయ్యేసరికి కొంత పోరాటల నేపధ్యంలోకి మారుతాయి.

ఏం కొట్టుకున్నారు భయ్యా.. పిడి గుద్దుల హోళీ.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా..?
Holi
P Shivteja
| Edited By: |

Updated on: Mar 03, 2026 | 4:45 PM

Share

రంగుల పండుగ హోలీ అంటేనే కేరింతలు..చిన్నా పెద్ద తేడా లేకుండా రంగులు పూసుకుంటూ జరుపుకునే సంబరం. కానీ, మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మాత్రం హోలీ పండుగ అంటే కేవలం రంగులే కాదు.. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటేనే అక్కడ పండుగ పూర్తవుతుంది. దశాబ్దాలుగా ఈ వింత ఆచారం కొనసాగుతుంది. వెల్దుర్తి మండల కేంద్రంలో హోలీ వేడుకలు అంటే మిగతా ఊర్ల కంటే కాస్త భిన్నం. రాష్ట్రమంతా ఒకరోజు హోలీ జరుపుకుంటే.. వెల్దుర్తిలో మాత్రం ఒకరోజు ముందే రంగుల వేడుక మొదలవుతుంది. ఉదయం పూట దైవ ప్రార్థనలతో ప్రారంభమయ్యే ఈ వేడుకలు.. రాత్రి అయ్యేసరికి కొంత పోరాటల నేపధ్యంలోకి మారుతాయి. హోళీ పండుగ రోజు రాత్రి కాగానే గ్రామస్తులంతా ఒక్కచోటికి చేరుకుంటారు. డప్పుల మోతతో గ్రామంలో భారీ ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ఒక పొడవాటి తాడును ఊరంతా తిప్పుతూ హనుమాన్ దేవాలయం వద్దకు చేరుకుంటారు. ఇక్కడే అసలైన ఆట మొదలవుతుంది. గ్రామస్తులంతా రెండు వర్గాలుగా విడిపోతారు.

తాడు విడవకుండా పిడిగుద్దులు..

ఒక చేత్తో పెద్ద తాడును గట్టిగా పట్టుకుని.. మరో చేత్తో ఎదుటి గ్రూపు వారిపై పిడిగుద్దుల వర్షం కురిపిస్తారు. ఎదుటివారు గుద్దుతున్నా వెనక్కి తగ్గకుండా.. మొండిగా తాడును పట్టుకుని ఈ వింత ఆచారాన్ని కొనసాగిస్తారు ఇక్కడి ప్రజలు. ఈక్రమంలో కొందరికి గాయాలైనా, అస్సలు పట్టించుకోరు. ఇది ఏ ఒక్కరి మీద కోపంతో చేసేది కాదు. ఇది కేవలం తరతరాలుగా వస్తున్న ఆచారం మాత్రమేనని స్థానికులు చెబుతున్నారు. ఇలా పిడిగుద్దులతో హోలీ జరుపుకుంటేనే గ్రామం సుభిక్షంగా ఉంటుందని,అందరూ సుఖసంతోషాలతో ఉంటారని వారి నమ్మకం.

వీడియో చూసేయండి..

Follow Us
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!