- Telugu News Photo Gallery Cinema photos Bigg Boss Fame Rathika Rose Shares Latest Crazy Stunning Photos Goes Viral
Bigg Boss:బిగ్బాస్ షోతో దారుణమైన నెగిటివిటీ.. కట్ చేస్తే.. నెట్టింట సెగలు పుట్టిస్తోన్న వయ్యారి..
బిగ్బాస్ రియాల్టీ షో ద్వారా ఫేమస్ అయ్యింది ఈ బ్యూటీ. అయితే ఈ షో ద్వారా ఫేమ్ కంటే ఎక్కువగా నెగిటివిటీని సొంతం చేసుకుంది. ఆమె ఆట తీరు కంటే ప్రవర్తన కారణంగానే ట్రోలింగ్ బారిన పడింది. దీంతో నాలుగు వారాల్లోనే షో నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఆ తర్వాత మరో ఛాన్స్ వచ్చినప్పటికీ ఈ బ్యూటీ నెగిటివిటీ మాత్రం తగ్గలేదు.
Updated on: Mar 04, 2025 | 1:11 PM

బిగ్బాస్ రియాల్టీ షో ద్వారా పాపులర్ అయ్యింది. కానీ ఆమె ప్రవర్తన కారణంగా ఎక్కువగా నెగిటివిటీని మూటగట్టుకుంది. ఈ షో కంటే ముందు పలు చిత్రాల్లో కథానాయికగా కనిపించింది. కానీ బిగ్బాస్ తర్వాత మాత్రం ఆమెకు అనుకున్నంతగా ఆఫర్స్ రాలేదు. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ?

ఈ అమ్మడు మరెవరో కాదు.. రతికా రోజ్.. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. సాధారణ రైతు కుటుంబానికి చెందిన అమ్మాయి. చిన్నప్పటి నుంచి చదువులలో చురుగ్గా ఉండే రతిక.. హైదరాబాద్ లోని మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ పూర్తి చేసింది.

అదే సమయంలో నటనపై ఆసక్తితో బుల్లితెరపైకి అడుగుపెట్టింది. మోడల్ గా పనిచేసిన రతిక.. 2020లో జబర్దస్త్ ఫేమ్ షకలక శంకర్ నటించిన బొమ్మ అదిరింది సినిమాతో కథానాయికగా మారింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేదు.

ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన నేను స్టూడెంట్ సర్ చిత్రంలో లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమా తర్వాత బిగ్బాస్ షోలోకి అడుగుపెట్టి తన పాపులారిటీ మరింత పెంచుకోవాలని అనుకుంది.

కానీ ఊహించని విధంగా బిగ్బాస్ షోతో ఆమెకు ఎక్కువగా నెగిటివిటీ వచ్చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది రతిక. తాజాగా ఈ అమ్మడు గ్లామర్ ఫోజులతో నెటిజన్లకు మతిపోగొడుతుంది.




