బడా హీరోల సినిమాలే టార్గెట్ చేస్తున్న శ్రుతి హాసన్ 

Rajeev 

10  march 2026

 టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్నాళ్ల క్రితం చక్రం తిప్పిన హీరోయిన్లలో శ్రుతిహాసన్ ఒకరు.

కమల్ హాసన్ కూతురిగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ అమ్మడికి మంచి క్రేజ్ ఉంది. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జోడిగా శ్రుతి హాసన్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది.

దీంతో తెలుగు, తమిళంలో ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. స్టార్ హీరోలతో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

అయితే కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఈ బ్యూటీ సైలెంట్ అయ్యింది. అంతేకాదు సినిమాలు సైతం తగ్గించేసింది.

ఇటీవలే సూపర్ స్టార్ రజినీకాంత్, నాగార్జున కలిసి నటించిన కూలీ చిత్రంలో కీలకపాత్రలో కనిపించింది.