Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అతడు స్టార్ కమెడియన్. సహజ నటన.. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇప్పుడిప్పుడే సినీరంగంలో వరుస ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. తెలంగాణలోని ఓ పల్లెటూరుకు చెందిన అతడు చిన్నప్పటి నుంచి హరికథలు, బుర్రకథలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇప్పుడు నటుడిగా రాణిస్తున్నాడు. ఇంతకీ అతడు ఎవరంటే..

చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్. అందుకే చిన్న వయసులోనే సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. మిమిక్రీ సైతం నేర్చుకున్నాడు. పలు టీవీ షోల్లో పాల్గొని తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ అంతకు ముందుకు కలెక్టర్ స్మిత సబర్వాల్ దగ్గర ఉద్యోగం చేశాడు. కొన్నాళ్లకు టాప్ కామెడీ షో జబర్దస్త్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. సహాయ నటుడిగా కనిపించిన ఆ కుర్రాడు ఇప్పుడు స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. తెలంగాణ యాసలో అతడు చెప్పే డైలాగ్స్.. యాక్టింగ్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. రెండు నిమిషాలు ఆగుతావా అంటూ అతడు ఓ సినిమాలో చెప్పిన డైలాగ్ ఎంతగా ఫేమస్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో కాదు.. కమెడియన్ రచ్చ రవి.
ఇప్పుడిప్పుడే సినీరంగంలో బిజీగా ఉంటున్నాడు. యాంకర్ ఉదయభాను హోస్టింగ్ చేసిన వన్స్ మోర్ ప్లీజ్ ప్రోగ్రాంలో మొదటిసారిగా మిమిక్రీ ప్రదర్శన ఇచ్చాడు. ఆ తర్వాత సినిమా అవకాశాల కోసం ఎంతగానో ప్రయత్నించాడు. చివరకు ఆఫర్స్ రాకపోవడంతో హైదరాబాద్ నుంచి తిరిగి వరంగల్ చేరుకున్నాడు. అక్కడ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగానికి చేరాడు. కొన్నాళ్లు కలెక్టర్ స్మితా సబర్వాల్ దగ్గర పనిచేశాడు. నటనపై ఆసక్తితో మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. దుబాయ్ వెళ్లి అక్కడ రేడియో జాకీగా పనిచేశాడు. అక్కడ అతడు చేసిన ప్రోగ్రామ్ సక్సెస్ కావడంతో తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు.
అదే సమయంలో జబర్దస్త్ కామెడీ షోలో పాల్గొన్నాడు. చమ్మక్ చంద్ర టీంలో తీస్కోలేదా రెండు లక్షల కట్నం అంటూ అతడు చెప్పే డైలాగ్ ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకున్నాడు. ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, భీమా, ఓం భీమ్ భుష్, గద్దల కొండ గణేష్, బలగం వంటి చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు రచ్చ రవి.
View this post on Instagram
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన