Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

ప్రస్తుతం సినీరంగంలో తోపు హీరోహీరోయిన్లుగా దూసుకుపోతున్న స్టార్స్ ఒకప్పుడు వాణిజ్య ప్రకటనలలో నటించారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఓ అమ్మాయి.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు స్టార్ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరికి పాప జన్మించింది.

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..
Deepika
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 31, 2025 | 5:33 PM

సినీరంగంలో చాలా మంది హీరోహీరోయిన్స్ కెరీర్ తొలినాళ్లల్లో పలు వాణిజ్య ప్రకటనలలో నటించిన సంగతి తెలిసిందే. డెన్మార్క్ లోని కోపెన్ హాగన్ లో కొంకణి మాట్లాడే భారతీయ తల్లిదండ్రులకు జన్మించిన ఓ అమ్మాయి నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అప్పట్లో పలు కమర్షియల్ ప్రకటనలు చేసిన ఈ భామ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతుంది. తెలుగు, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఒక్కో సినిమాకు భారీగా పారితోషికం తీసుకుంటూ కుర్ర హీరోయిన్లకు సైతం చుక్కలు చూసిస్తుంది. అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు తన బాడీ గార్డ్ కే రూ. కోటి 20 లక్షల జీతం ఇస్తుంది. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా.. ? తనే హీరోయిన్ దీపికా పదుకొణే.

కెరీర్ అరంభంలోనే లిరిల్ సోప్ యాడ్ చేసి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత 2007లో షారుఖ్ ఖాన్ సరసన ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమా ఏకంగా బాద్ షాతో కొట్టేసింది. ఈ సినిమా తర్వాత దీపికా వెనుదిరిగి చూడలేదు. బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన దీపికాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే బాలీవుడ్ హీరో రణవీర్ కపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సైతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.

గతేడాది సెప్టెంబర్ లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తన కూతురుతో కలిసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఇటీవలే ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి సినిమాతో సౌత్ అడియన్స్ ముందుకు వచ్చింది దీపికా. త్వరలోనే కల్కి పార్ట్ 2 షూటింగ్ స్టార్ట్ కానుంది.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..