Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

విక్టరీ వెంకటేశ్ నటించిన చిత్రాల్లో ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టని సినిమా మల్లీశ్వరీ. డైరెక్టర్ కె.విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలను అందించగా.. బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ నటించింది.

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Malliswari
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 10, 2025 | 10:16 AM

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 14న రిలీజ్ కానుంది. ఇందులో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. ఇదిలా ఉంటే వెంకీ నటించిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో మల్లీశ్వరి ఒకటి. ఎన్నిసార్లు చూసినా ఇప్పటికీ బోర్ కొట్టని సినిమా ఇది. డైరెక్టర్ కె.విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో వెంకీ సరసన బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించగా.. త్రివిక్రమ్ మాటలు అందించారు. ఈ సినిమాలో వెంకటేష్ యాక్టింగ్, కామెడీ టైమింగ్ మాములుగా ఉండదు. అలాగే బ్రహ్మానందం, సునీల్, వెంకటేశ్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ఈ సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో వెంకీ అన్న కూతురిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. వెంకీ కామెడీకి తగినట్లుగా పంచ్ డైలాగ్ లతో అలరించింది. ఈ చిన్నారి ఇప్పుడు హీరోయిన్ లా మారిపోయింది. అప్పట్లో ముద్దుగా కనిపించిన ఆ అమ్మాయి.. ఇప్పుడు పూర్తిగా మారిపోయి హీరోయిన్ లుక్ లోకి వచ్చేసింది. ఆమె మేకోవర్ చూసి అందరూ షాకవుతున్నారు. ఇంతకీ ఆ చిన్నారి పేరు ఏంటో తెలుసా..? ఆమె పేరు గ్రీష్మ నేత్రిక.

గ్రీష్మ నేత్రిక.. తెలుగులో అనేక సినిమాల్లో నటించింది. అమ్ములు, మల్లీశ్వరి, అశోక్, కొంచం ఇష్టం కొంచం కష్టం, ప్రస్తానం, పంచాక్షరి, ఏమో గుర్రం ఎగరవచ్చు సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న గ్రీష్మ నేత్రిక.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.