Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

సౌత్ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పుడున్న హీరోయిన్స్ అందరి కంటే తాను ప్రత్యేకం అని నిరూపించుకుంది. స్టార్ హీరోల కంటే ఎక్కువగా క్రేజ్ సొంతం చేసుకుని.. ఒక్కో సినిమాకు భారీగా పారితోషికం తీసుకుంటుంది. ఆమె సినిమా వచ్చిందంటే చాలు థియేటర్లు దద్ధరిల్లాల్సిందే.

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 26, 2024 | 7:32 PM

సినీరంగంలో కథానాయికలుగా స్టార్ డమ్ రావాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుంది. అందం, అభినయంతో ఇండస్ట్రీలోని పోటీని సైతం పక్కకు నెట్టి తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలి. ప్రస్తుతం దక్షిణాదిలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. మొదటి సినిమాతోనే తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. మలయాళం, తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆమెకు స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? తొలి సినిమాతోనే ఓ రేంజ్ క్రేజ్ క్రియేట్ చేసుకున్న ఆ ముద్దుగుమ్మ.. అనేక భారీ బడ్జెట్ చిత్రాలను, స్టార్ హీరోల ఆఫర్స్ రిజెక్ట్ చేసింది. అలాగే కోట్లు విలువైన యాడ్స్ సైతం రిజెక్ట్ చేసి అందరూ అవాక్కయ్యేలా చేసింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి. ఆమెను తెలుగు అడియన్స్ ముద్దుగా లేడీ పవర్ స్టార్ అని పిలుచుకుంటారు.

చదివింది వైద్య విద్య.. అయినా సినీరంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రేమమ్ సినిమాతో మలయాళీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన సాయి పల్లవి.. తొలి చిత్రంతోనే ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఆ తర్వాత ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమై అందరినీ మెస్మరైజ్ చేసింది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో నటిస్తూ స్టార్ డమ్ సంపాదించుకుంది. ఇప్పుడు అక్కినేని నాగచైతన్య సరసన తండేల్ చిత్రంలో నటిస్తుంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. అలాగే హిందీలో రణబీర్ కపూర్ జోడిగా రామాయణం సినిమాలో సీత పాత్రలో నటిస్తుంది. గ్లామర్ కు దూరంగా ఉంటూ.. సహజత్వానికి ప్రాధాన్యత ఇస్తూ అడియన్స్ గుండెల్లో నిలిచిపోయింది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే అనేక సినిమాలు రిజెక్ట్ చేసింది సాయి పల్లవి. అలాగే రీమేక్ సినిమాల్లో నటించడం తనకు ఇష్టం లేదని చెప్పేసింది. అయితే సాయి పల్లవి గతంలో ఓ వాణిజ్య ప్రకటనను రిజెక్ట్ చేసిందట. ఆ యాడ్ చేయడానికి ఆమెకు రూ.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఆ సంస్థ అధినేత ముందుకు రాగా సాయి పల్లవి ఆ అవకాశాన్ని వదులుకున్నారట. కాస్మోటిక్ కు సంబంధించిన ఆ యాడ్ చేసేందుకు సాయి పల్లవి నిరాకరించారట. సౌందర్య సాధానాలతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయని.. దీంతో ప్రజల ఆరోగ్యం ఎఫెక్ట్ అవుతుందని.. అందుకే తాను ఎలాంటి కాస్మోటిక్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయనని సున్నితంగా తిరస్కరించిందట.

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.