AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

శుక్రవారం అర్దరాత్రితో బిగ్ బాస్ ఓటింగ్ లైన్స్ ముగిశాయి. ఇక రేపు (డిసెంబర్ 15న) ఈ సీజన్ విన్నర్ ఎవరనేది తెలియనుంది. మొత్తం టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఇద్దరి మధ్య బీభత్సమైన పోటీ నెలకొంది. గౌతమ్ వర్సెస్ నిఖిల్ అత్యధిక ఓటింగ్ తో దూసుకుపోతున్నారు.

Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..
Bigg Boss 8 Telugu
Rajitha Chanti
|

Updated on: Dec 14, 2024 | 11:47 AM

Share

బిగ్‏బాస్ సీజన్ 8 ముగింపుకు చేరుకుంది. రేపు (డిసెంబర్ 15న) జరగబోయే గ్రాండ్ ఫినాలేతో ఈ సీజన్ విన్నర్ ఎవరనేది తెలియనుంది. ప్రస్తుతం హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ గౌతమ్, నబీల్, ప్రేరణ, నిఖిల్, అవినాష్ ఉన్నారు. వీరిలో ముందు నుంచి గౌతమ్, నిఖిల్ మధ్య టైటిల్ పోరు హోరా హోరీగా జరుగుతుంది.

బిగ్‏బాస్ ఇన్ఫినిటీ సీజన్ 8 రేపటితో ఎండ్ కార్డ్ పడనుంది. 2024 సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ షో దాదాపు 105 రోజులపాటు నడిచింది. డిసెంబ్ 15న ఈ షోలో గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా నిర్వహించనున్నారు. మొత్తం 22 మందితో ఈ షో స్టార్ట్ కాగా.. ఇప్పుడు 5గురు మిగిలారు. దీంతో ఇప్పుడు ఈ సీజన్ విన్నర్ ఎవరనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ముందు నుంచి టైటిల్ రేసులో నిఖిల్ దూసుకుపోతున్నాడు. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చి హీరోగా మారాడు గౌతమ్. తన ఆట తీరు, ప్రవర్తన అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. దీంతో గౌతమ్ కు ఊహించని విధంగా ప్రేక్షకుల సపోర్ట్ పెరిగింది. ప్రస్తుతం గౌతమ్, నిఖిల్ మధ్య పోటా పోటీగా నడుస్తుంది. ఇక ఆ తర్వాతి స్థానాల్లో నబీల్, ప్రేరణ, అవినాష్ ఉన్నారు. గత ఆదివారం రాత్రి నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ కాగా.. నిన్నటి అర్దరాత్రితో ముగిశాయి. అయితే సోషల్ మీడియాలో ఓటింగ్ లైన్స్ చూస్తే.. గౌతమ్, నిఖిల్ ఇద్దరికీ దాదాపు 80 శాతం ఓటింగ్ పడింది. ఆ తర్వాత నబీల్, ప్రేరణ, అవినాష్ కు ఓట్లు పడుతున్నాయి.

మొదటి రెండు రోజుల్లో గౌతమ్, నిఖిల్ మధ్య స్వల్ప ఓటింగ్ తేడా నెలకొంది. ఇద్దరూ టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్నారు. ఈ ఇద్దరి మధ్య మొదటి రోజు నుంచి ఐదో రోజు వరకు స్థానాల్లో మార్పులు జరిగాయి. మొదటి రోజు నిఖిల్ టాప్ లో ఉండగా.. ఆతర్వాతి స్థానంలో గౌతమ్ ఉన్నాడు. ఇక రెండో రోజు గౌతమ్ ఓటింగ్ ఒక్కసారిగా పెరిగింది. అయితే ఆఖరు రోజు మాత్రం టాప్ 2 కంటెస్టెంట్స్ ఓటింగ్ విపరీతంగా పెరిగింది. దీంతో మిగతా ముగ్గురి ఓటింగ్ భారీగా తగ్గింది. కానీ అన్ అఫీషియల్ పోల్స్ మాత్రం విన్నర్ ఎవరనేది వేర్వుగా చూపిస్తున్నాయి. యూట్యూబ్ లో ఒకరు విజేత అంటే.. సోషల్ మీడియాలో మరొకరు విజేత అని చూపిస్తుంది. దీంతో ఇప్పుడు సీజన్ 8 విన్నర్ ఎవరనేది రేపటి వరకు సస్పెన్సే.

ఇవి కూడా చదవండి

కొన్ని పోల్స్ చూస్తుంటే.. గౌతమ్ టాప్ లో ఉన్నాడు. శుక్రవారం అర్దరాత్రి ఓటింగ్ లైన్స్ ముగిసేసరికి గౌతమ్ 38 శాతం ఓటింగ్ తో టాప్ లో ఉన్నాడు. ఇక నిఖిల్ కు 33 శాతం ఓట్లు పడ్డాయి. ఇద్దరి మధ్య కేవలం స్వల్ప ఓటింగ్ తేడా మాత్రమే ఉంది. ఆతర్వాత మూడో స్థానంలో నబీల్ ఉండగా.. నాలుగో స్థానంలో ప్రేరణ నిలిచింది. ఇక చివరి స్థానంలో అవినాష్ ఉన్నాడు. ప్రేరణ, అవినాష్ ఇద్దరికీ సింగిల్ డిజిట్ ఓటింగ్ పడింది. బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే రేపు అట్టహాసంగా జరగనుంది.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us