Tollywood: సర్వేపల్లి రాధాకృష్ణన్‏తో ఉన్న ఈ చిన్నోడు సౌత్ స్టార్ హీరో.. ఎవరో తెలుసా.. ?

సోషల్ మీడియాలో ఇటీవల కొన్నాళ్లుగా త్రోబ్యాక్ ఫోటోస్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం దేశ మొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‏కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో రాధాకృష్ణన్ తోపాటు కనిపిస్తోన్న ఆ చిన్నోడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. ఇంతకీ ఈ ఫోటోకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.

Tollywood: సర్వేపల్లి రాధాకృష్ణన్‏తో ఉన్న ఈ చిన్నోడు సౌత్ స్టార్ హీరో.. ఎవరో తెలుసా.. ?
Actor
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 06, 2024 | 5:21 PM

సోషల్ మీడియాలో నిత్యం సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం వైరలవుతుందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినీతారల చిన్ననాటి ఫోటోస్ నెట్టింట తెగ షేర్ చేస్తుంటారు అభిమానులు. ఈ క్రమంలోనే తాజాగా సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరో చిన్ననాటి పిక్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. భారత మొదటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కు సంబంధించిన ఫోటో అది. అందులో సర్వేపల్లితోపాటు ఒక చిన్న కుర్రాడు కనిపిస్తున్నాడు కదా. అతడు దక్షిణాదిలో వన్ ఆఫ్ ది టాప్ హీరో. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆ పిల్లాడు ఇప్పుడు భారతదేశం గర్వంచదగ్గ గొప్ప నటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అద్భుతమైన నటనతో కొన్ని వందల సినిమాల్లో నటించి అడియన్స్ మనసులు గెలుచుకున్నాడు. తెలుగు, తమిళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించారు. ఎలాంటి పాత్రలలోనైనా ఇట్టే జీవించేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన నటనకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. అందుకే అతడిని అందరూ లోకనాయకుడు అని పిలుచుకుంటారు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ? అతడు మరెవరో కాదండి విశ్వనటుడు కమల్ హాసన్.

నాలుగేళ్ల వయసులోనే కలత్తూర్ కణమ్మ అనే సినిమాలో బాలనటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలో ఆయన నటనకు రాష్ట్రపతి మెడల్ లభించింది. అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆ బంగారు పతకాన్ని స్వయంగా కమల్ హాసన్ కు అందించారు. అదే పైన కనిపిస్తున్న ఫోటో. బాలనటుడిగా అలరించిన కమల్ హాసన్ ఆ తర్వాత హీరోగా మెప్పించారు. ఎన్నో చిత్రాల్లో నటించి వెండితెరపై తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు.

ఇప్పటికీ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు కమల్ హాసన్. విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. కానీ ఆ తర్వాత డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ కాంబోలో వచ్చిన భారతీయుడు 2 సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక ఆ తర్వాత ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి చిత్రంలో కీలకపాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు కమల్.

View this post on Instagram

A post shared by Kamal Haasan (@ikamalhaasan)

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.