Tollywood: డ్యాన్స్ వీడియోలతో మెంటలెక్కించిన అమ్మాయి.. కట్ చేస్తే.. పాన్ ఇండియా స్టార్ సరసన ఛాన్స్..
సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడు ఎవరు ఫేమస్ అవుతారో ఊహించలేం. ముఖ్యంగా ఇటీవల కొందరు యువతి యువకులు డ్యాన్స్ వీడియోలతో చాలా పాపులర్ అవుతున్నారు. అందులో ఈ అమ్మాయి కూడా ఒకరు. డ్యాన్స్ వీడియోస్ చేసి ఇప్పుడు ఏకంగా ఓ స్టార్ హీరోకు జోడిగా నటించే ఛాన్స్ కొట్టేసింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో డ్యాన్సర్లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. లేటేస్ట్ సూపర్ హిట్ పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. దీంతో తక్కువ సమయంలోనే నెట్టింట చాలా ఫేమస్ అవుతున్నారు. అయితే ఇప్పటి వరకు నెట్టింట పాపులర్ అయిన చాలా మంది అటు వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి సైతం ఇప్పుడు అదే జాబితాలోకి వస్తుంది. ఆమెకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడే డాన్స్ నేర్చుకుంది. ఇక సోషల్ మీడియాలో నిత్యం డ్యాన్స్ వీడియోస్ షేర్ చేస్తూ చాలా పాపులర్ అయ్యింది. దీంతో ఇప్పుడు ఏకంగా ఓ స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఇంకెవరు ప్రభాస్ జోడిగా నటిస్తోన్న ఇమాన్వీ.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ ఒకటి. ఇందులో కథానాయికగా ఎంపికైంది ఈ అమ్మాయి. ఢిల్లీలో పుట్టిపెరిగిన ఇమాన్వికి డాన్స్ అంటే చాలా ఇష్టం. అటు ఎంబీఏ చేసి జాబ్ చేస్తూ ఇటు డ్యాన్స్ వీడియోస్ చేస్తూ ఉండేది. ఇక తండ్రి ఇచ్చిన సలహాతో జాబ్ మానేసి సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కొత్త కొత్త స్టెప్పులతో యువతను ఆకట్టుకుంది.
ఆమె డ్యాన్స్ వీడియోలకు విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. ఇమాన్వీకి ఇన్ స్టాలో 9 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నాయి. సోషల్ మీడియాలో ఆమె చేసే డ్యాన్స్, పాటకు తగినట్లుగా ఆమె ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ చూసి డైరెక్టర్ హను రాఘవపూడి సైతం ఫిదా అయ్యారు. దీంతో ఆమెకు ఏకంగా ప్రభాస్ సరసన ఛాన్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ జరుగుతుంది.
View this post on Instagram
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.