AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ అమ్మడు రేంజ్ వేరే బాస్.. హాలీవుడ్ హీరోయిన్లకే చుక్కలు చూపిస్తోన్న ఇండియన్ బ్యూటీ..

ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఓ సాధారణ అమ్మాయి తనదైన నటనతో అడియన్స్ హృదయాలను కొల్లగొట్టింది. అతి తక్కువ సమయంలోనే సినీరంగంలో తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు కోట్లకు యజమానిగా మారింది. ఇంతకీ ఆ వయ్యారి ఎవరంటే..

Tollywood: ఈ అమ్మడు రేంజ్ వేరే బాస్.. హాలీవుడ్ హీరోయిన్లకే చుక్కలు చూపిస్తోన్న ఇండియన్ బ్యూటీ..
Actress New
Rajitha Chanti
|

Updated on: Nov 29, 2024 | 4:27 PM

Share

ప్రజలకు వినోదాన్ని అందించే మార్గాలలో సినిమా ఒకటి. ఎప్పుడూ సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తుంటాయి. భాషతో సంబంధం లేకుండా ప్రతి సినిమాను చూసి ప్రజలు ఎంజాయ్ చేస్తుంటారు. ముఖ్యంగా సినిమాల్లో హీరోలతోపాటు కొందరు హీరోయిన్స్ కూడా భారీగా ఫాలోయింగ్ సొంతం చేసుకుంటారు. అలాగే ఓ రేంజ్ లో పారితోషికం తీసుకుంటారు. ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటి ఎవరో తెలుసా? దీపికా పదుకొణె, అలియా భట్ అనుకున్నారంటే మీరు పొరపడినట్లే. ఒక్కో సినిమాకి 40 కోట్లు తీసుకునే ఈ భామ బీహార్ రాష్ట్రంలో జన్మించింది. నటనపై ఆసక్తితో మోడిలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె మరెవరో కాదు ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా. బాలీవుడ్‌లో హీరోయిన్ల పారితోషికాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించిన ఆమె బాలీవుడ్‌లోనే కాకుండా హాలీవుడ్‌లోనూ సత్తా చాటుతుంది.

ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా ఒక్క సినిమాకు రూ.40 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. అయితే కేవలం హాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఈ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకుంటుంది. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిస్తున్నప్పుడు ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఒక్క సినిమాకు రూ.14 నుంచి రూ.20 కోట్లు తీసుకుంది. ప్రియాంక చోప్రా 2002లో విజయ్ సరసన ‘తమిజాన్’ సినిమాతో తమిళంలో అడుగుపెట్టింది. ప్రియాంకకు ఇదే మొదటి సినిమా. ఆ తర్వాత వరుస హిందీ సినిమాల్లో నటించింది. ‘బర్ఫీ’, ‘మేరీ కోమ్’, ‘బాజీరావ్ మస్తానీ’, ‘దిల్ తడగ్నే దో’ వంటి చిత్రాలలో నటించింది.

ప్రియాంక నటించిన తొలి హాలీవుడ్ చిత్రం ‘బేవాచ్’ ఘనవిజయం సాధించింది. ఇది 2017లో విడుదలైంది. ఆ తర్వాత ‘ఎ కిడ్ లైక్ జేక్’, ‘ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్’, ‘వి ఆర్ హీరోస్’, ‘ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్’, ‘లవ్ ఎగైన్’ వంటి చిత్రాల్లో నటించింది. తన కంటే చిన్నవాడైన ప్రముఖ పాప్ సింగర్ నిక్ జోనాస్‌ని పెళ్లి చేసుకుంది. వారి వివాహం ఉమైద్ భవన్ అనే ప్యాలెస్‌లో జరిగింది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా ఆస్తి దాదాపు 650 కోట్లు. ఒక ప్రైవేట్ జెట్, అమెరికాలో రెండు బంగ్లాలు, వివిధ లగ్జరీ కార్లకు యజమాని.

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆరోగ్య సిరి.. ఉసిరి తినే ముందు ఈ 6 విషయాలు గుర్తించుకోండి! లేదంటే
ఆరోగ్య సిరి.. ఉసిరి తినే ముందు ఈ 6 విషయాలు గుర్తించుకోండి! లేదంటే
OG సీక్వెల్ నుంచి ఆయన అవుట్.. సూపర్ ట్విస్ట్
OG సీక్వెల్ నుంచి ఆయన అవుట్.. సూపర్ ట్విస్ట్
స్మైల్‌తో కట్టిపడేస్తున్న బ్యూటీ.. ఆషికా అందానికి ఫిదా అవ్వాల్సిం
స్మైల్‌తో కట్టిపడేస్తున్న బ్యూటీ.. ఆషికా అందానికి ఫిదా అవ్వాల్సిం
ప్రేమే జీవితం.. ప్రియుడే సర్వం అనుకుంది.. చివరకు
ప్రేమే జీవితం.. ప్రియుడే సర్వం అనుకుంది.. చివరకు
ఏ హీరో ఎక్కడున్నారు..? ఎవరి సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోంది
ఏ హీరో ఎక్కడున్నారు..? ఎవరి సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోంది
దూరం నుంచి పిల్లో.. గండుపిల్లో అనుకునేరు..కాస్త దగ్గరకెళ్లి చూడగా
దూరం నుంచి పిల్లో.. గండుపిల్లో అనుకునేరు..కాస్త దగ్గరకెళ్లి చూడగా
ఏపీ ప్రజలకు న్యూ ఇయర్ కానుక.. డిసెంబర్ 26 నుంచి మొదలు..
ఏపీ ప్రజలకు న్యూ ఇయర్ కానుక.. డిసెంబర్ 26 నుంచి మొదలు..
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది
అయోధ్యలో బంగారు రాముడు..! అజ్క్షాత వ్యక్తి పంపిన కోట్లు ఖరీదైన
అయోధ్యలో బంగారు రాముడు..! అజ్క్షాత వ్యక్తి పంపిన కోట్లు ఖరీదైన
54 బంతుల్లో 150..డివిలియర్స్‎కు రిటైర్మెంట్ గిఫ్ట్ ఇచ్చిన వైభవ్
54 బంతుల్లో 150..డివిలియర్స్‎కు రిటైర్మెంట్ గిఫ్ట్ ఇచ్చిన వైభవ్