Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

తెలుగు సినీ పరిశ్రమలో అతి తక్కువ సమయంలో ఫేమస్ అయిన హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. త్రినేత్రం, భద్రచలం వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సింధు మీనన్.. ఆ తర్వాత కొన్నాళ్లు బ్రేక్ తీసుకుంది. కానీ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన చందమామ సినిమాతో మరింత పాపులర్ అయ్యింది. ఇంతకీ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా.. ?

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?
Sindu Menon
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 12, 2024 | 11:58 AM

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ సినిమాల గురించి చెప్పక్కర్లేదు. ఇక ఆయన సినిమాల్లో హీరోయిన్లను ఎంత అందంగా చూపిస్తుంటారో తెలిసిందే. డేరింగ్ అండ్ డ్యాషింగ్స్ అమ్మాయిల్లా.. అందమైన ముద్దుగుమ్మలుగా.. అల్లరి పిల్లలుగా కథానాయికల పాత్రలను తీర్చిదిద్దుతారు. డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందించిన సూపర్ హిట్ చిత్రాల్లో చందమామ ఒకటి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా వచ్చిన ఈ చిత్రంలో నవదీప్, శివబాలాజీ, కాజల్ అగర్వాల్, సింధు మీనన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇందులో ఆహుతి ప్రసాద్, నాగబాబు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాతోనే కాజల్ స్టార్ డమ్ అందుకుంది. అలాగే ఈ సినిమాకు ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇందులో కాజల్ పాత్ర ఎంతో సాఫ్ట్ గా ఉంటే.. అల్లరి పిల్లగా.. కాజల్ చెల్లిగా నటించి అలరించింది సింధు మీనన్. రౌడీ అమ్మాయిగా.. అమాయకమైన అల్లరి పిల్లగా తనదైన నటనతో కట్టిపడేసింది.

సింధు మీనన్ చందమామ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ అయ్యింది. కానీ ఆమె అంతకు ముందే దివంగత నటుడు శ్రీహరి నటించిన భద్రచలం సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత త్రినేత్రం సినిమాలో ప్రేమికుడి కోసం పరితపించే అమ్మాయిగా దెయ్యంగా “ఆహా..” అంటూ వెండితెరపై మాయ చేసింది. ఈ సినిమాల తర్వాత శ్రీరామచంద్రులు, ఇన్స్పెక్టర్, ఆడంతే అదో టైపు సినిమాల్లో నటించింది.

తెలుగు, తమిళం, కన్నడ భాషలలో నటించిన ఈ అమ్మడు.. కొన్నాళ్ల తర్వాత చందమామ, వైశాలి చిత్రాలతో సరైన బ్రేక్ తీసుకుంది. ఈ రెండు సినిమాలతో స్టార్ డమ్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత బిజీ అవుతుందని అనుకున్నారు. కానీ అలా కాకుండా చివరగా సిద్ధం సినిమాలో నటించింది. 2010లో డొమినిక్ ప్రభు అనే ఐటీ ఉద్యోగిని వివాహం చేసుకుని యూకేలో స్థిరపడింది. ఆమెకు ఓ కూతురు, కుమారులు ఉన్నారు. తాజాగా సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ ఫోటోస్ పంచుకుంది సింధూ మీనన్. ఇందులో ఆమె కూతురు ట్రెడిషనల్ గా.. ఎంతో క్యూట్ గా కనిపిస్తుంది. దీంతో తెలుగు తెరకు మరో చందమామ దొరికిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Tollywood: ఆ ఒక్క డైలాగ్‏తో నెట్టింట తెగ ఫేమస్.. ఈ యంగ్ హీరో సతీమణి ఎవరో గుర్తుపట్టారా.?

Pawan Kalyan: ఏంటీ బాస్.. మరీ అంత తక్కువా.. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ తెలిస్తే..

Samantha: సామ్ ఈజ్ బ్యాక్.. సిటాడెల్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.