Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

అరుంధతి.. తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని సినిమా. డైరెక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇందులో అనుష్క, సోనూసూద్ ప్రధాన పాత్రలు పోషించారు. 2009లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో అనుష్క పాత్ర గురించి చెప్పక్కర్లేదు.

Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?
Leena Siddhu
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 05, 2024 | 6:45 PM

డైరెక్టర్ కోడి రామకృష్ణ తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో అద్భుత చిత్రాలను తెరకెక్కించారు. విభిన్న ప్రయోగాలు.. వైవిధ్యమైన పాత్రలను సృష్టించి వెండితెరపై మాయ చేశారు. ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇండస్ట్రీలో ఆయన తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో అరుంధతి ఒకటి. హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. అప్పట్లోనే ఈ మూవీ భారీ వసూళ్లు రాబట్టింది. 2009లో రిలీజ్ అయిన ఈ సినిమాకు అనేక అవార్డులు, రివార్డులు దక్కాయి. మొత్తం ఏడు విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వం నంది పురస్కారాలను అందించింది. అలాగే ఈ సినిమాతో ఇండస్ట్రీలో అనుష్క పేరు మారుమోగిపోయింది. ఇందులో ఆమె నటనకు అభిమానులు, విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. ఈ ఒక్క సినిమా ఆమె కెరీర్ మార్చేసింది. అరుంధతి మూవీతో స్టార్ డమ్ అందుకున్న అనుష్క.. ఆ తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ అయ్యింది.

ఇక ఈ సినిమాలో షీయాజీ షిండే, సోనూ సూద్, మనోరమ, కైకాల సత్యనారాయణ, దివ్య నగేష్, అర్జున్ బజ్వా, ఆహుతి ప్రసాద్, మీనా వాసు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇందులో పశుపతి పాత్రలో భయంకరమైన నటనతో అల్లాడించేశాడు సోనూసూద్. ఇక ఈ మూవీలో అరుంధతి చిన్నప్పటి డ్యాన్స్ టీచర్ గా కనిపించిన నటి గుర్తుందా..? ఈ మూవీలో ఆమె కనిపించింది కాసేపు అయినప్పటికీ అందం, అభినయంతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఆమె పేరు లీనా సిద్ధు. అరుంధతి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

అరుంధతి సినిమాలో అనుష్కకు చిన్ననాటి నుంచి నాట్యంలో శిక్షణ ఇస్తూ.. పశుపతి దుర్మార్గానికి బలైపోయే పాత్రలో ఆమె నటించింది. లీనా సిద్ధు అచ్చమైన తెలుగమ్మాయే. టాలీవుడ్ లో అరుంధతి సినిమా తర్వాత ఛార్మీ నటించిన కావ్య’s డైరీ, లంక, హ్యాపీ హ్యాపీగా వంటి చిత్రాల్లో నటించింది. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లోనూ పలు చిత్రాల్లో నటించింది. సినిమా పరిశ్రమలోనే కాకుండా మోడలింగ్ రంగంలో మెప్పించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న లీనా సిద్ధు.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఆమె ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

View this post on Instagram

A post shared by Leena Sidhu (@leenasid)

View this post on Instagram

A post shared by Leena Sidhu (@leenasid)

ఇది చదవండి : Tollywood : అదృష్టం కలిసిరాని అందాల రాశి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా.. ?

Dandupalyam Movie: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. దండుపాళ్యం హీరోయిన్‏ను చూస్తే షాకవ్వాల్సిందే..

Tollywood: నిర్మాతలు డబ్బులు ఇవ్వలేదు.. ఎన్నో ఇబ్బందులు పడిన హీరోయిన్.. చివరకు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.