AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: నిర్మాతలు డబ్బులు ఇవ్వలేదు.. ఎన్నో ఇబ్బందులు పడిన హీరోయిన్.. చివరకు..

ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్స్ ద్వారా ఫుల్ పాపులర్ అయిన ఓ హీరోయిన్.. కెరీర్ ఆరంభంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని తెలిపింది. రెండు సూపర్ హిట్ పాటలకు పనిచేసినప్పటికీ నిర్మాతలు డబ్హులు ఇవ్వలేదని చెప్పుకుంది. కానీ ఆ రెండు పాటలు ఆమె కెరీర్ ను మలుపు తిప్పాయి.

Tollywood: నిర్మాతలు డబ్బులు ఇవ్వలేదు.. ఎన్నో ఇబ్బందులు పడిన హీరోయిన్.. చివరకు..
Actress Latest
Rajitha Chanti
|

Updated on: Nov 02, 2024 | 7:21 AM

Share

బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది నోరా ఫతేహి. 2018 సంవత్సరంలో విడుదలైన ‘దిల్బర్-దిల్బర్’ పాటతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. కెరీర్ ఆరంభంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోంది. తన కెరీర్ మలుపు తిప్పిన దిల్బర్ పాటకు ఒక్క పైసా కూడా తీసుకోలేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ పాట మాత్రమే కాకుండా ఇటీవల శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు నటించిన ‘స్త్రీ’లోని ‘కమరియా’ కోసం కూడా ఎలాంటి పారితోషికం తీసుకోలేదని చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న నోరా ఫతేహి.. తన కెరీర్ మలుపు తిప్పిన రెండు పాటలను ఉచితంగానే చేసిందట. ఈ విషయాన్ని రాజీవ్ మసంద్‌తో మెల్‌బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చెప్పుకొచ్చింది.

ఈ ఫెస్టివల్‌లో దిల్బర్, కమరియా పాటలను ప్రదర్శించగా.. ఆ రెండు పాటలకు ఎలాంటి డబ్బులు తీసుకోలేదని తెలిపింది. , జాన్ అబ్రహం చిత్రం ‘సత్యమేవ్ జయతే’లోని ‘దిల్బర్’ పాట యూట్యూబ్‌లో ఒక బిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ అందుకుంది. దిల్బర్ మాట్లాడుతూ.. “ఆ సమయంలో చాలా డబ్బులు అవసరం.. కానీ కేవలం డబ్బుల కోసమే ఆ సాంగ్ చేయలేదు. దిల్బర్ పాట కోసం స్టెప్పులు కోఆర్డినేట్ అయ్యేలా నేనే వారం రోజులపాటు డ్యాన్సర్స్ అందరికీ శిక్షణ ఇచ్చాను. అలాగే ఆ పాటలో ఎన్నో మార్పులు చేశానని.. ఈ పాటను డ్యాన్స్ ఓరియెంటెడ్ పాటగా మార్చాలని చిత్రనిర్మాతలు చెప్పారు. కానీ ఈ పాట కోసం వారు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు. అప్పుడు నేను కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే ముందు కెరీర్ ముఖ్యం. డబ్బుల గురించి తర్వాత ఆలోచించాలని అనుకున్నాను. కానీ ఈ పాటకు చాలా పొట్టి దుస్తులు ఇచ్చారు. అవి నాకు నచ్చలేదు. దీంతో దుస్తులు మార్పించుకున్నాను” అని చెప్పుకొచ్చింది.

అలాగే తాను యశ్ రాజ్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుందని.. గతంలో ఆ సంస్థ నుంచి ఆఫర్ వస్తే కొన్ని వారాలపాటు శ్రమించానని.. ఆడిషన్ ఇచ్చిన చివరకు తనను రిజెక్ట్ చేశారని తెలిపింది. తాను అందంగా లేనని చెప్పడంతో కోపంగా ఫోన్ పగలకొట్టానని.. చివరకు ఆ సినిమా ప్లాప్ అయ్యిందని చెప్పుకొచ్చింది. ఆ సినిమా కోసమా ఇంతగా బాధపడిందని ఆత్మస్థైర్యం తెచ్చుకున్నాను.. మనకు రాసి పెట్టి ఉంటే ఎప్పటికైనా అది మనకే దక్కుతుందని అర్థమైందని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Nora Fatehi (@norafatehi)

ఇది చదవండి : Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‏గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..

Tollywood: ఫోక్ సాంగ్‏తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్‏గా అదరగొట్టేసింది..

Tollywood: అమ్మడు ఇది నువ్వేనా.. ఈ రేంజ్ ఛేంజ్ ఏంటమ్మా.. దృశ్యంలో వెంకీ కూతురు చూస్తే మైండ్ బ్లాంకే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..