- Telugu News Photo Gallery Cinema photos Ram charan game changer movie team gives hope on movie update for Diwali or Christmas 2024, telugu Heroes Photos
Game Changer: అభిమానుల ఆశల మీద మరోసారి నీళ్లు చల్లేసింది గేమ్ చేంజర్ టీమ్.!
అభిమానుల ఆశల మీద మరోసారి నీళ్లు చల్లేసింది గేమ్ చేంజర్ టీమ్. దసరా టీజర్ పక్కా అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్న ఫ్యాన్స్‌కి అలాంటిదేం లేదంటూ షాక్ ఇచ్చింది యూనిట్. అయితే కాసత్ ఆలస్యమైన ఈ వెయిటింగ్ వర్తే అంటూ మరోసారి ఫ్యాన్స్‌ను కన్విస్ చేసేందుకు ట్రై చేస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఆడియన్స్‌కు మరోసారి షాక్ ఇచ్చింది గేమ్ చేంజర్ టీమ్. దసరాకి టీజర్ పక్కా అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్న ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చింది.
Updated on: Nov 02, 2024 | 8:16 PM

సినిమా ఏదైనా ఇష్యూను తీసుకుని రాజకీయంగా దాన్ని బాగా చూపిస్తారు శంకర్. చాలా ఏళ్ళ తర్వాత గేమ్ ఛేంజర్‌తో ఇదే చేయాలని చూస్తున్నారు ఈ దర్శకుడు.

అబ్బాయ్ కోసం బాబాయ్ తరలి వస్తున్నారనే టాపిక్ యమాగా కిక్ ఇస్తోంది. గేమ్ చేంజర్ లేటెస్ట్ మెలోడీకి కూడా మంచి మార్కులు పడుతున్నాయి.

అందుకే భారీ రిలీజ్, అడ్వాన్స్ బుకింగ్స్ మీదే ఎక్కువగా దృష్టి పెట్టాలన్న సజెషన్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

గేమ్ చేంజర్ సినిమాను బిగ్ స్కేల్‌లో రూపొందిస్తున్నారు శంకర్. గ్రాఫిక్స్ వర్క్ కూడా భారీగా ఉంది. ఆ పనులు పూర్తి చేయడానికే కాస్త టైమ్ పడుతుందని, ఈ టైమ్‌లో టీజర్, గింప్ల్స్ అంటూ వేరే పనులు పెట్టుకుంటే మెయిన్ వర్క్ డిస్ట్రబ్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు.

ఇది ఏ స్థానంలో ఉంటుందా అనే చర్చ మొదలైంది ట్రేడ్ వర్గాల్లో..! చరణ్‌కు ఓవర్సీస్ మార్కెట్ ఎక్కువే. పైగా శంకర్ సినిమాలు అక్కడ రప్ఫాడిస్తుంటాయి.

డిసెంబర్ 20 లేదా క్రిస్టమస్‌కి సినిమా రిలీజ్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఈ అప్‌డేట్‌తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గేమ్ చేంజర్ అప్‌డేట్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

జరగండి, రా మచ్చ సాంగ్స్ విషయంలో ముందు నెగెటివ్ కామెంట్స్ వినిపించినా... ఫైనల్‌గా సూపర్ హిట్ అయ్యాయి. మిలియన్ల కొద్ది వ్యూస్‌తో సత్తా చాటుతున్నాయి. దీంతో సినిమా మీద కూడా అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.





























