AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oasis Fertility: తల్లిదండ్రులుగా మారిన దంపతులకు ఒయాసిస్ ఫెర్టిలిటీ స్పెషల్ గిఫ్ట్.. అదిరిన బేబీ షవర్..

సంతానలేమి అనే సమస్యను దాటి.. తల్లిదండ్రులు కావాలని వచ్చిన జంటలకు ఆనందమే హద్దులు లేవు. తమ కలలను నిజం చేసుకున్న దంపతుల ఆశలను, నమ్మకాన్ని సెలబ్రేట్ చేస్తూ.. ప్రముఖ ఫెర్టిలిటీ సంస్థ ఒయాసిస్ ఫెర్టిలిటీ కాకినాడలో ఒక ప్రత్యేకమైన బేబీ షవర్ వేడుకను నిర్వహించింది. అధునాతన వైద్య చికిత్సలతో సంతాన సాఫల్యతను అందించడమే కాకుండా, తల్లిదండ్రులైన దంపతులను అభినందిస్తూ నిర్వహించిన బేబీ షవర్ వేడుక ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది.

Oasis Fertility: తల్లిదండ్రులుగా మారిన దంపతులకు ఒయాసిస్ ఫెర్టిలిటీ స్పెషల్ గిఫ్ట్.. అదిరిన బేబీ షవర్..
Kakinada Oasis Fertility
Krishna S
|

Updated on: Feb 27, 2026 | 7:25 PM

Share

16 ఏళ్లుగా ఫెర్టిలిటీ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న ఒయాసిస్ ఫెర్టిలిటీ, కాకినాడ సెంటర్‌లో చికిత్స పొంది తల్లిదండ్రులుగా మారిన జంటల కోసం ఒక ప్రత్యేకమైన బేబీ షవర్ వేడుకను నిర్వహించింది. సంతానలేమి సమస్యలను అధిగమించి, తల్లిదండ్రులు కావాలనే తమ కలను నిజం చేసుకున్న జంటల ధైర్యాన్ని, నమ్మకాన్ని అభినందిస్తూ ఈ హృదయపూర్వక వేడుకను సంస్థ ఏర్పాటు చేసింది. కాకినాడ సెంటర్ ప్రారంభమైనప్పటి నుండి అనేకమంది నిస్సహాయ జంటలకు ఒయాసిస్ ఫెర్టిలిటీ కొత్త ఆశలను కల్పించింది. ఇక్కడ అందుబాటులో ఉన్న అధునాతన చికిత్స విధానాలు IUI, IVF, PGT, ERA, TESA. జంటల కలలను సాకారం చేయడంలో కీలకంగా మారాయి. మైక్రోఫ్లూయిడిక్స్ ద్వారా స్పెర్మ్ సెలెక్షన్, అండం, వీర్యకణాల క్రయోప్రిజర్వేషన్, PGT వంటి అత్యాధునిక ఫెర్టిలిటీ చికిత్సలను ప్రవేశపెట్టడం ద్వారా, ఈ ప్రాంతంలో రీప్రొడక్టివ్ హెల్త్కేర్ రంగంలో ఒయాసిస్ ముందంజలో నిలిచింది.

వైద్యుల అభిప్రాయాలు

ఈ సందర్భంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ కో-ఫౌండర్, మెడికల్ డైరెక్టర్ డా. దుర్గా జి. రావు మాట్లాడుతూ.. ఒయాసిస్ ఫెర్టిలిటీలో ప్రతి విజయం, ఆశ, సంరక్షణ, నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ దంపతుల అసాధారణ ధైర్యాన్ని, వారు ఎంతోకాలంగా ఎదురుచూసిన కొత్త ఆరంభాలను సంబరంగా జరుపుకోవడానికే ఈ బేబీ షవర్ వేడుకను నిర్వహించినట్లు తెలిపారు. ‘‘ఫెర్టిలిటీ చికిత్సల సహాయంతో తల్లిదండ్రులుగా మారే అనుభవం ఎంతో ప్రత్యేకమైనది.. వారి ఈ ప్రయాణంలో తోడుగా నిలవడం మా భాగ్యంగా భావిస్తున్నాము” అని అన్నారు. CEO పుష్కరాజ్ షెనాయ్ మాట్లాడుతూ.. ఒయాసిస్ ఫెర్టిలిటీ సీఈవో పుష్కరాజ్ షెనాయ్ మాట్లాడుతూ.. ‘‘ఒకప్పుడు ఎంతో ఆశతో మా వద్దకు వచ్చిన జంటలు నేడు తల్లిదండ్రులుగా మారడం నిజంగా మాకెంతో ఆనందంగా ఉంది. కరుణతో కూడిన వైద్యం, ఆధునిక ఆవిష్కరణలు కలిసి కొత్త జీవితం అందించే ఇన్ ది గుడ్ హ్యాండ్స్ అఫ్ సైన్స్‌పై వారి నమ్మకాన్ని సంబరంగా జరుపుకునే వేడుక ఈ బేబీ షవర్. ఒయాసిస్ ఫెర్టిలిటీలో తల్లిదండ్రులు అవ్వాలనే ప్రతి జంట కలను సాకారం చేయడానికి సహానుభూతితో కూడిన ఫెర్టిలిటీ సేవలను అత్యుత్తమ వైద్య నైపుణ్యంతో కలిపి అందించడం కొనసాగిస్తాము.” అని తెలిపారు.

కాకినాడ కన్సల్టెంట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డా. రామినీడి దీప్తి ప్రియదర్శని మాట్లాడుతూ.. “బేబీ షవర్ వంటి సందర్భాలు.. ఫెర్టిలిటీ సంరక్షణ అనేది కేవలం సైన్స్ మాత్రమే కాదని ఆనందంతో నిండిన కొత్త జీవితాలను సృష్టించడం అని గుర్తుచేస్తాయని అన్నారు. ‘‘ఈ బేబీ షవర్ వేడుక ఫెర్టిలిటీ సమస్యలను ధైర్యంగా అధిగమించి, తమ కలలను నిజం చేసుకున్న జంటలను ఒకే వేదికపైకి తీసుకువస్తుంది. నేడు ఇక్కడ వారి ముఖాల్లో కనిపిస్తున్న ఆనందం మాకందరికీ ఒక గొప్ప బహుమతి’’ అని అన్నారు.

భవిష్యత్ ప్రణాళికలు

భవిష్యత్తులో కూడా శాస్త్రీయ ప్రావీణ్యాన్ని పెంపొందిస్తూ, పేషెంట్-కేంద్రిత సంరక్షణను అందించడం ద్వారా రీప్రొడక్టివ్ హెల్త్కేర్ రంగంలో తన ప్రభావాన్ని మరింతగా పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. 2009లో స్థాపించిన ఓయాసిస్ ఫెర్టిలిటీ.. దేశవ్యాప్తంగా 34 కేంద్రాలతో అగ్రగామి రీప్రొడక్టివ్ హెల్త్కేర్ ప్రొవైడర్. నైతిక వైద్యపద్ధతులు, అత్యున్నత IVF విజయశాతాలతో ప్రసిద్ధి చెందిన ఈ సంస్థ, పురుషులు, మహిళల కోసం IVF, IUI, ICSI, ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్ వంటి విస్తృత సేవలను ఆధునిక ల్యాబ్ టెక్నాలజీతో అందిస్తోంది.

మరిన్ని వివరాలకు దయచేసి సందర్శించండి: www.oasisindia.in

Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!