AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీల్ మేకర్ vs చికెన్.. ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..?

బరువు తగ్గాలన్నా, కండరాలు పెరగాలన్నా ప్రోటీన్ డైట్ తప్పనిసరి. జిమ్‌కు వెళ్లేవారి దగ్గరి నుంచి బరువు తగ్గాలనుకునే వారి వరకు అందరిలోనూ ఎప్పుడూ ఉండే ప్రశ్న ప్రోటీన్ కోసం ఏం తినాలి అని.. తక్కువ ఖర్చుతో పోషకాలు అందించే మీల్ మేకర్ ముందుంటుందా, లేక కండరాల పుష్టికి చికెన్ మేలా? అసలు దేనితో ఆరోగ్యానికి ఎక్కువ లాభం? అనే విషయాలు తెలుసుకుందాం..

మీల్ మేకర్ vs చికెన్.. ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
Meal Maker Vs Chicken
Krishna S
|

Updated on: Nov 27, 2026 | 5:20 PM

Share

శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ ఎంతో అవసరం. జిమ్‌కు వెళ్లేవారు, బరువు తగ్గాలనుకునేవారు, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టేవారు నిత్యం ప్రోటీన్ ఆహారం కోసం వెతుకుతుంటారు. మాంసాహారులకు చికెన్, గుడ్లు ప్రధాన ప్రోటీన్ వనరులుగా కనిపిస్తే.. శాకాహారులకు మీల్ మేకర్, పనీర్ బెస్ట్ ఆప్షన్లుగా నిలుస్తాయి. అయితే ప్రోటీన్ విషయంలో మీల్ మేకర్ గొప్పదా లేక చికెనా? దేని వల్ల ఆరోగ్యానికి ఎక్కువ మేలు జరుగుతుంది అనే డౌట్లు చాలా మందికి వస్తుంటాయి. శాకాహారంలో చవకైన, అత్యంత పోషకమైన ఆహారంగా సోయా ఉత్పత్తులకు మంచి పేరుంది. శరీరం సొంతంగా తయారు చేసుకోలేని తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు సోయాలో లభిస్తాయి. అందుకే దీన్ని కంప్లీట్ ప్రోటీన్ సోర్స్‌గా భావిస్తారు. ఇందులో సంతృప్త కొవ్వు తక్కువగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. కాల్షియం, మెగ్నీషియం, రాగి వంటి ఖనిజాలతో పాటు ఐసోఫ్లేవోన్‌లు ఎముకల సాంద్రతను కాపాడి, ఆస్టియోపొరోసిస్ ముప్పును తగ్గిస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటంతో జీర్ణక్రియ సాఫీగా సాగి, మలబద్ధకం సమస్య దరిచేరదు. ప్రోటీన్ వల్ల జీవక్రియ చురుగ్గా మారుతుంది.

చికెన్ వల్ల లభించే లాభాలు

కండరాల పుష్టి, వేగవంతమైన పోషకాల అందజేత విషయంలో చికెన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. లీన్ ప్రోటీన్ పుష్కలంగా ఉండే చికెన్ కండరాల పెరుగుదల, రికవరీకి బాగా ఉపయోగపడుతుంది. అందుకే అథ్లెట్లు, జిమ్ లవర్స్ దీన్ని ఇష్టపడతారు. కొవ్వు తక్కువగా ఉండే చికెన్ బ్రెస్ట్ తింటే ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగి, అనవసరంగా తినే అలవాటు తగ్గుతుంది. ఇందులోని కాల్షియం, ఫాస్ఫరస్ ఎముకలను బలోపేతం చేస్తాయి. ట్రిప్టోఫాన్, విటమిన్ బి5 ఒత్తిడిని తగ్గించి, మూడ్‌ను మెరుగుపరుస్తాయి. అలాగే విటమిన్ బి6 రక్తంలో హోమోసిస్టీన్ స్థాయిలను నియంత్రించి గుండె సంబంధిత ముప్పును తగ్గించడంలో సహాయపడుతుంది.

ఏది బెస్ట్..? ఎవరు ఏది తినాలి?

ప్రోటీన్ శాతం పరంగా చూస్తే సోయా ఆధారిత ఆహారంలో ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రోటీన్ నాణ్యత, శరీరం సులభంగా గ్రహించే గుణం విషయంలో చికెన్ కొంచెం ముందుంటుంది. బరువు తగ్గాలన్నా, కండరాలు పెరగాలన్నా తక్కువ కేలరీలు, వేగంగా శోషించబడే ప్రోటీన్ కోసం చికెన్ బెస్ట్ ఆప్షన్. తక్కువ ఖర్చులో, సంతృప్త కొవ్వు లేని పోషకాల కోసం మీల్ మేకర్ బెస్ట్.

తినేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

సోయా ఉత్పత్తులలోని యాంటీ-న్యూట్రియంట్స్ పోవాలంటే వాటిని తప్పనిసరిగా నానబెట్టి లేదా బాగా ఉడికించి తినాలి. అలాగే చికెన్‌ను డీప్ ఫ్రై చేయడం కంటే బాయిల్ చేసి లేదా గ్రిల్ చేసి తింటేనే ఆరోగ్యానికి పూర్తి ప్రయోజనం దక్కుతుంది.

Follow Us