Jani Master: సొంతూరులో ఫ్యామిలీతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్న జానీ మాస్టర్.. ఫొటోస్ ఇదిగో

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడు. ఓ మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసారు. సుమారు 33 రోజుల జైలులో గడిపిన అతను ఇటీవలే బెయిల్ పై బయటకువచ్చాడు.

Jani Master: సొంతూరులో ఫ్యామిలీతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్న జానీ మాస్టర్.. ఫొటోస్ ఇదిగో
Jani Master
Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Nov 04, 2024 | 9:55 AM

జైలు నుంచి విడుదలయ్యాక పెద్దగా బయట కనిపించడం లేదు జానీ మాస్టర్. తన దగ్గర పనిచేసే ఓ లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు జానీ. ఇదే కేసులో అరెస్టైన జానీ ఇటీవలే బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చాడు. అయితే జైలు నుంచి రిలీజైన తర్వాత బయట పెద్దగా కనిపించడం లేదీ స్టార్ కొరియోగ్రాపర్. ఎక్కువగా తన కుటుంబ సభ్యులతోనే సమయం గడుపుతున్నాడు. ఇక ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి నెల్లూరుకు వెళ్లాడు. అక్కడే దీపావళి పండగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఇందులో అతని భార్య, ఇద్దరు పిల్లలు ఎంతో ఆనందంగా కనిపించారు. దీపావళి సెలబ్రేషన్స్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన జానీ మాస్టర్.. ‘వాళ్ల కేరింతలే మన సంతోషం.. ఈ పండుగ నాడు మీరు వెలిగించే ప్రతి బాణాసంచాలాంటి చిరునవ్వులు, మిఠాయిల్లాంటి మధురమైన క్షణాలు మీ జీవితంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ దీపావళి’ అని అందరికీ విషెస్ చెప్పాడు.

ప్రస్తుతం జానీ మాస్టర్ షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు జానీ మాస్టర్ కు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చాలా రోజుల తరువాత జానీ మాస్టర్ లో సంతోషం కనిపించిందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇక జైలు నుంచి ఇంటికి వెళ్లిన సమయంలో జానీ మాస్టర్ ను హత్తుకుని ఆయన పిల్లలు, భార్య భావోద్వేగానికి లోనైన వీడియోలు వైరల్ గా మారడం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

భార్య, పిల్లలతో జానీ మాస్టర్ దీపావళి వేడుకలు.. ఫొటోస్ ఇదిగో..

కాగా పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కోవడంతో కమిటీ జానీ మాస్టర్ కు వచ్చిన జాతీయ అవార్డును సైతం నిలిపివేసింది అవార్డుల కమిటీ. దీనిని చాలామంది ప్రముఖులు తప్పుపడుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయం చేసి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..