Aishwarya Rai: ఐష్ పుట్టిన రోజు.. కనీసం విష్ కూడా చేయని అభిషేక్, అమితాబ్.. అసలేం జరుగుతోంది?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ శుక్రవారం (నవంబర్ 01) తన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఐశ్వర్యారాయ్ కు బర్త్ డే విషెస్ తెలిపారు.

Aishwarya Rai: ఐష్ పుట్టిన రోజు.. కనీసం విష్ కూడా చేయని అభిషేక్, అమితాబ్.. అసలేం జరుగుతోంది?
Aishwarya Rai Bachchan Fami
Follow us
Basha Shek

|

Updated on: Nov 01, 2024 | 9:37 PM

ఇన్నాళ్లు హ్యాపీగా గడిపిన ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ మధ్య ఇప్పుడు మనస్పర్థలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఐష్, అభిషేక్ ఇప్పటికే వేరుగా ఉంటున్నారని నెట్టింట ప్రచారం జరుగుతోంది. అందుకు సాక్ష్యంగా కొన్ని సంఘటనలు కూడా జరుగుతున్నాయి. శుక్రవారం (నవంబర్ 1) ఐశ్వర్యరాయ్ బచ్చన్ పుట్టినరోజు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, బంధువులు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. షాకింగ్ విషయం ఏంటంటే.. భర్త అభిషేక్ బచ్చన్, మామయ్య అమితాబ్ బచ్చన్ ఐశ్వర్యకు అసలు శుభాకాంక్షలు చెప్పలేదు. దీంతో అభిమానుల మదిలో మరిన్ని సందేహాలు మొదలయ్యాయి. ఈ రోజుల్లో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ ఎక్కడా కలిసి కనిపించడం లేదు. అనంత్ అంబానీ పెళ్లికి ఐశ్వర్యారాయ్ ఒంటరిగా వచ్చింది. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలకు జంటలు కలిసి వస్తుంటారు. అయితే ఐశ్వర్య ఒంటరిగా రావడంతో వారి కుటుంబంలో ఏదో సమస్య ఉందని స్పష్టమైంది.

ఇక కొన్ని నెలల క్రితం అభిషేక్ బచ్చన్ తన భార్యను వదిలి ఒంటరిగా విదేశాలకు వెళ్లాడు. దీంతో విడాకులకు సంబంధించిన గాసిప్‌లకు మరింత బలం చేకూరింది. ఇప్పుడు అభిషేక్ బచ్చన్ తన భార్య పుట్టినరోజుకు ఎలాంటి విష్ చేయలేదు. సాయంత్రం వరకు వేచి చూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇక ఆ కుటుంబంలో మనస్పర్థలు వచ్చినట్లు మరింత స్పష్టమవుతోంది.

గత ఏడాది నుంచి అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ వివాహ బంధంపై సందేహాలు తలెత్తాయి. నవంబర్ 1, 2023న ఐశ్వర్యరాయ్ తన పుట్టినరోజును జరుపుకున్నప్పుడు, అభిషేక్ బచ్చన్ ‘హ్యాపీ బర్త్ డే’ అని మాత్రమే పోస్ట్ చేశాడు. ఆ మాటల్లో ఏ భావమూ లేదు. కేవలం అలా పోస్ట్ చేశాడని నెటిజన్లు వ్యాఖ్యానించారు. ఐశ్వర్యరాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ విడాకుల గురించి ఎన్ని గాసిప్‌లు ఉన్నప్పటికీ వారి నుంచి ఎటువంటి స్పందన ఉండడం లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?