Kiran Abbavaram: రహస్యతో వివాహం.. కట్నం గురించి అడిగితే హీరో కిరణ్ అబ్బవరం ఏమన్నాడో తెలుసా?

క సినిమా విషయానికి వస్తే.. కిరణ్ అబ్బవరం సరసన నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లు గా నటించారు. ఈ సినిమాకు సుజీత్, సందీప్ దర్శకులుగా వ్యవహరించారు. దీపావళి కానుకగా గురువారం (అక్టోబర్ 31)న విడుదలైన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తోంది.

Kiran Abbavaram: రహస్యతో వివాహం..  కట్నం గురించి అడిగితే హీరో కిరణ్ అబ్బవరం ఏమన్నాడో తెలుసా?
Kiran Abbavaram Family
Follow us

|

Updated on: Oct 31, 2024 | 9:32 PM

సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా ఎదిగిన వాళ్లలో కిరణ్ అబ్బవరం ఒకడు. ఆంధ్రప్రదేశ్‌లోని రాయచోటి ప్రాంతానికి చెందిన అతను మొదట రాజువారు రాణిగారు సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఎస్ ఆర్ కల్యాణ మండపంతో మంచి హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత కూడా మంచి సినిమాలే చేశాడీ యంగ్ హీరో. అయితే విజయం మాత్రం దక్కలేదు. దీంతో కొంచెం గ్యాప్ తీసుకున్న కిరణ్ లేటెస్ట్ గా పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీపావళి కానుకగా గురువారం (అక్టోబర్ 31)న విడుదలైన క సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తోంది. పోటీలో లక్కీ భాస్కర్, అమరన్ లాంటి పెద్ద సినిమాలున్నా కిరణ్‌ సినిమాకే ఎక్కువగా పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో చాలా రోజుల తర్వాత ఈ ట్యాలెంటెడ్ హీరో ఖాతాలో ఒక హిట్ పడినట్లుంది. కాగా క సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు కిరణ్ అబ్బవరం. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అందులో తన భార్య రసహ్య గోరఖ్ తో ప్రేమాయణం, పెళ్లి తదితర విషయాలు కూడా ఉన్నాయి. కాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా ‘ఎంత కట్నం తీసుకున్నావు? అన్న ప్రశ్నకు ‘నేను కట్నం తీసుకోలేదు. నాకసలు అలాంటివి ఇష్టం ఉండవు. కాకపోతే వాళ్ల కూతురికి ఏమైనా నచ్చితే పెట్టుకోనీ.. అది వాళ్ల ఇష్టం’ అని ఎంతో హుందాగా సమాధానమిచ్చాడు కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. కిరణ్ అబ్బవరంపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా రాజావారు రాణిగారు సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు కిరణ్‌, రహస్య గోరఖ్. వీరిద్దరికి ఇదే మొదటి సినిమా. అంతుకు మందు సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా పనిచేశారు. అయితే సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చారు. మొదటి సినిమా షూటింగ్ సమయంలోనే మనసులు ఇచ్చి పుచ్చుకున్నారు. సుమారు ఐదేళ్లు ప్రేమలో మునిగితేలిన ఈ లవ్ బర్డ్స్ ఈ ఏడాది ఆగస్టు 22న పెళ్లిపీటలెక్కారు. కర్ణాటకలోని కూర్గ్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇక క సినిమా ప్రమోషన్లలోనూ తళుక్కుమంది రహస్య. తన భర్తకోసమైనా ఈ సినిమాను చూడాలంటూ ప్రేక్షకులను కోరింది.

అంధులతో సెలబ్రేషన్స్.. వీడియో