AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: పోలీసులకే చుక్కలు చూపించే సైకో కిల్లర్.. ఓటీటీలోకి మరో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్

కేరళలోని కోళికోడ్ నగరంలో వరుసగా జరిగే హత్యల నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ఈ మూవీని తెరకెక్కించారు. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించింది.

OTT Movie: పోలీసులకే చుక్కలు చూపించే సైకో కిల్లర్.. ఓటీటీలోకి మరో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Feb 27, 2026 | 9:41 PM

Share

ఓటీటీలో అన్ని రకాల కంటెంట్ ఉంటుంది. లవ్, ఫ్యామిలీ, కామెడీ, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్.. ఇలా అన్ని జానర్లకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో ఉంటాయి. అయితే ప్రజెంట్ ట్రెండ్ మాత్రం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలే. భాషతో సంబంధం లేకుండా ఈ జానర్ సినిమాలను చూసేస్తున్నారు ఆడియెన్స్. అందులోనూ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలైతే ఎగబడి మరీ చూసేస్తున్నారు ఆడియెన్స్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమానే. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాగానే ఆడింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా విషయానికి వస్తే.. కేరళలోని కొచ్చి నగరంలో వరుసగా హత్యలు జరుగుతాయి. ఈ మర్డర్ల మిస్టరీని ఛేదించేందుకు ఏసీపీ స్టాలిన్ జోసెఫ్ రంగంలోకి దిగుతాడు. అయితే కిల్లర్ మాత్రం చాలా తెలివిగా, చిన్న క్లూ కూడా దొరక్కుండా హత్యలు చేస్తూ పోలీసులకు చుక్కలు చూపిస్తుంటాడు. అయితే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా, ఈ హత్యల వెనుక ఒక భయంకరమైన పగ, ప్రతీకారం ఉందని, చనిపోయిన వారంతా గతంలో ఒక తప్పు చేసిన వాళ్లేనని ఏసీపీ స్టాలిన్ జోసెఫ్ తెలుసుకుంటాడు. మరి ఆ హంతకుడు ఎవరు? అతనికి ఉన్న పగ ఏంటి? చివరకు జోసెఫ్ ఆ సైకో కిల్లర్ ను పట్టుకున్నాడా? లేదా? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ పేరు ధీరం. ఇదొక మలయాళం సినిమా. జితిన్ జోసెఫ్ తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో ఇంద్రజిత్ సుకుమారన్‌తో పాటు అజు వర్గీస్ ఏసీపీ పాత్రలో ఆకట్టుకున్నాడు. అలాగే మంగళవారం నటి దివ్య పిళ్లై మరో కీలక పాత్రలో మెరిసింది. వీరితో పాటు విజయరాఘవన్, నిశాంత్ సాగర్, పానీ-ఫేమ్ సాగర్ సూర్య, రెబా మోనికా జాన్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. మార్చి 06 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉంది.

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అప్పుడు హీరో.. ఒక్క సినిమాతో మారిన కెరీర్..
అప్పుడు హీరో.. ఒక్క సినిమాతో మారిన కెరీర్..
నాలుగో వన్డేకు టీమిండియాలో భారీ మార్పులు.. స్టార్ ప్లేయర్లు దూరం
నాలుగో వన్డేకు టీమిండియాలో భారీ మార్పులు.. స్టార్ ప్లేయర్లు దూరం
బ్యాచిలర్స్ కోసం కేరళ చికెన్ రోస్ట్.. రుది అదిరిపోద్ది
బ్యాచిలర్స్ కోసం కేరళ చికెన్ రోస్ట్.. రుది అదిరిపోద్ది
ఏ గ్లాస్‌లో ఎక్కవ నీరు ఉన్నాయో 10 సెకన్లలో చెబితే మీరే తోపు
ఏ గ్లాస్‌లో ఎక్కవ నీరు ఉన్నాయో 10 సెకన్లలో చెబితే మీరే తోపు
ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరికి పొంచి ఉన్న ముప్పు
ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరికి పొంచి ఉన్న ముప్పు
ఆరోగ్యానికి శ్రీరామరక్ష ఈ రొట్టెలు..అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
ఆరోగ్యానికి శ్రీరామరక్ష ఈ రొట్టెలు..అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
పళ్లు తెల్లగా, శుభ్రంగా ఉన్నా నోటి దుర్వాసన వస్తోందా? కారణమిదే
పళ్లు తెల్లగా, శుభ్రంగా ఉన్నా నోటి దుర్వాసన వస్తోందా? కారణమిదే
నీళ్లు లేకున్నా మండే ఎడారుల్లో పాములు ఎలా బతుకుతాయ్..?
నీళ్లు లేకున్నా మండే ఎడారుల్లో పాములు ఎలా బతుకుతాయ్..?
రాత్రి మిగిలిన అన్నంతో నూనె లేకుండా పొంగే రోటీలు
రాత్రి మిగిలిన అన్నంతో నూనె లేకుండా పొంగే రోటీలు
బకాయి ఫీజుల పేరుతో MBBS సర్టిఫికెట్లు ఆపితే కుదరదు..!హైకోర్టు
బకాయి ఫీజుల పేరుతో MBBS సర్టిఫికెట్లు ఆపితే కుదరదు..!హైకోర్టు