AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కళ్ల అందాన్ని తగ్గిస్తున్న డార్క్ సర్కిల్స్ – ఎందుకు వస్తాయంటే?

కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడటానికి ప్రధాన కారణం సరిపడా నిద్ర లేకపోవడం. నిద్ర సరిగా లేకపోతే కళ్లపై ఒత్తిడి పెరిగి కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వస్తాయి. అందుకే రోజుకు 7-8 గంటలు నిద్రపోవడం అలవాటు చేసుకోండి. డార్క్ సర్కిల్స్ ఏర్పడటానికి ఇతర కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.. సరైన కారణాలు తెలుసుకుంటే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

కళ్ల అందాన్ని తగ్గిస్తున్న డార్క్ సర్కిల్స్ – ఎందుకు వస్తాయంటే?
Dark Circles
Jyothi Gadda
|

Updated on: Feb 27, 2026 | 9:17 PM

Share

కళ్ల కింద నల్లటి వలయాలు అంటే డార్క్ సర్కిల్స్ సమస్య ఇప్పుడు చాలా మందిని వేధిస్తోంది. ఇవి కేవలం అందానికి మాత్రమే కాదు, ఆరోగ్య పరిస్థితులకూ సంకేతంగా ఉండొచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడటానికి ప్రధాన కారణం సరిపడా నిద్ర లేకపోవడం. నిద్ర సరిగా లేకపోతే కళ్లపై ఒత్తిడి పెరిగి కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వస్తాయి. అందుకే రోజుకు 7-8 గంటలు నిద్రపోవడం అలవాటు చేసుకోండి. డార్క్ సర్కిల్స్ ఏర్పడటానికి ఇతర కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.. సరైన కారణాలు తెలుసుకుంటే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

1. నిద్రలేమి:

తగినంత నిద్ర లేకపోతే కళ్ల చుట్టూ చర్మం పలుచబడుతుంది. దీంతో రక్తనాళాలు స్పష్టంగా కనిపించి నల్లటి వలయాల్లా కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

2. అధిక స్క్రీన్ టైమ్:

మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ ఎక్కువసేపు చూడటం వల్ల కళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది డార్క్ సర్కిల్స్‌కు దారి తీస్తుంది.

3. డీహైడ్రేషన్:

తగినంత నీరు తాగకపోతే చర్మం పొడిబారుతుంది. కళ్ల కింద భాగం మరింత మసకబారినట్లు కనిపిస్తుంది. దీంతో చర్మం ముడతలు పడటమే కాకుండా కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే రోజుకు 8-9 గ్లాసుల వాటర్ తాగడం మంచిది.

4. అలర్జీలు:

డస్ట్, పొల్యూషన్ లేదా ఇతర అలర్జీల వల్ల కళ్లను తరచుగా రుద్దడం జరుగుతుంది. దీంతో చర్మం నలుపు రంగులోకి మారుతుంది.

5. వయస్సు పెరగడం: వయస్సు పెరుగుతున్న కొద్దీ చర్మం పలుచబడుతుంది. కొలాజెన్ తగ్గిపోవడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు స్పష్టంగా కనిపిస్తాయి.

6. జన్యుపరమైన కారణాలు:

కొందరికి కుటుంబ పరంగా ఈ సమస్య ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ప్రత్యేక చికిత్స అవసరం కావచ్చు.

7. పోషకాహార లోపం:

ఇనుము, విటమిన్ K, విటమిన్ C వంటి పోషకాలు తగ్గితే కూడా డార్క్ సర్కిల్స్ ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాదు..ఉప్పు ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఫ్లూయిడ్స్ పెరిగిపోతాయి. తద్వారా కళ్ల కింద ఉబ్బుగా మారడం, డార్క్ సర్కిల్స్ ఏర్పడటం జరుగుతుంది. అందుకే వీలైనంత వరకు ఉప్పు తక్కువగా తీసుకోండి.

8. సరైన ఆహారం:

పోషకాహారం తీసుకోకుండా జంక్ ఫుడ్ ఎక్కువగా తింటే బాడీలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. దీనివల్ల చర్మం పాలిపోయినట్లు కనబడుతుంది. అలాగే డార్క్ సర్కిల్స్ కూడా అవుతాయి. అందుకే ఐరన్ లోపం లేకుండా చూసుకోవాలి. షుగర్ ఎక్కువగా తినడం వల్ల చర్మం తొందరగా డ్యామేజ్ అవుతాయి. కళ్ల కింద డార్క్ సర్కిల్స్ కూడా ఏర్పడతాయి. అందువల్ల షుగర్ తగ్గించడం మేలు.

తరచూ వేడి నీళ్లతో ముఖం కడగటం వల్ల చర్మ కణాలు డ్యామేజ్ అవుతాయి. తద్వారా కళ్ల కింద చర్మం ఉబ్బినట్లుగా మారుతుంది. అలాగే డార్క్ సర్కిల్స్ కూడా అవుతాయి. దుమ్ము, ధూళిలో ఎక్కువగా తిరగడం ద్వారా అందుకే విషపదార్థాలు చర్మాన్ని డ్యామేజ్ చేస్తాయి. అలాగే దీర్ఘకాలంలో డార్క్ సర్కిల్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే కాలుష్యంలో ఉండేవారు జాగ్రత్తలు తీసుకోవడం మేలు.

ఎలా తగ్గించుకోవాలి?:

రోజుకు 7–8 గంటలు నిద్రపోవాలి. తగినంత నీరు తాగాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. స్క్రీన్ టైమ్ తగ్గించాలి. అవసరమైతే చర్మ వైద్యుడిని సంప్రదించాలి. చిన్న మార్పులు చేస్తే డార్క్ సర్కిల్స్ సమస్యను నియంత్రించవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి అందమైన కళ్లకు మొదటి మెట్టు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us