Tollywood: హీరోయిన్‏ను విసుక్కుంటూ ఆ మాట అనేసిన ఫోటోగ్రాఫర్.. కౌంటరిచ్చిన బ్యూటీ.. వీడియో వైరల్..

బాలీవుడ్ హీరోయిన్ సనా మక్బుల్ కు కోపమొచ్చింది. దీపావళి పార్టీకి విచ్చేసిన ఈ బ్యూటీ పట్ల ఓ ఫోటోగ్రాఫర్ చేసిన కామెంట్స్ పట్ల ఆమె అసహనం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుండగా.. ఆ ఫోటోగ్రాఫర్ తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

Tollywood: హీరోయిన్‏ను విసుక్కుంటూ ఆ మాట అనేసిన ఫోటోగ్రాఫర్.. కౌంటరిచ్చిన బ్యూటీ.. వీడియో వైరల్..
Sana Makbul
Follow us

|

Updated on: Oct 31, 2024 | 8:16 PM

సాధారణంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫోటోగ్రాఫర్స్ హడావిడి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. సెలబ్రెటీస్ ఎక్కడ కనిపించిన పర్మిషన్ లేకుండానే ఫోటోస్, వీడియోస్ తీస్తు తెగ హల్చల్ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో స్టార్స్ ఇబ్బందికి గురవుతున్నా ఏమాత్రం పట్టించుకోరు. ఇప్పటికే రణబీర్ కపూర్, అలియా భట్, దీపికా, జయా బచ్చన్ వంటి స్టార్స్ ఫోటోగ్రాఫర్స్ పై సీరియస్ అయ్యారు. తాజాగా ఓ హీరోయిన్ పట్ల ఫోటోగ్రాఫర్ ప్రవర్తించిన తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. దీపావళి పండగ సందర్భంగా నటుడు అర్జున్ బిజ్లానీ ముంబైలో పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి పలువురు సెలబ్రెటీలు హజరయ్యారు. అందులో బాలీవుడ్ బ్యూటీ, బిగ్ బాస్ ఫేమ్ సనా మక్బుల్ కూడా ఉంది. పార్టీలో అడుగుపెట్టేముందు అక్కడున్న ఫోటోగ్రాఫర్లకు ఓపికగా ఫోజులిస్తూ ఫోటోస్ దిగింది. కాసేపటికి ఓ ఫోటోగ్రాఫర్ సనాను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఆమెకు కోపం తెప్పించాయి.

చిరునవ్వుతో ఫోటోస్ దిగుతున్న సనాను ఉద్దేశించి ఓ ఫోటోగ్రాఫర్ అసలు మజాయే రావట్లేదు. ఇటు తిరగండి అంటూ కటువుగా మాట్లాడాడు. దీంతో అతడి మాటలు విని షాకైన సనా వెంటనే అతడికి కౌంటరిచ్చింది. “ఇది చాలా తప్పు. ఇంత చీప్ గా ప్రవర్తిస్తారా..? మీరిలా మాట్లాడకూడదు.. తప్పు ” అంటూ కౌంటరిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. సదరు ఫోటోగ్రాఫర్ తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. సనా మక్బుల్ తెలుగులో దిక్కులు చూడకు రామయ్య, మామ ఓ చందమామ చిత్రాల్లో నటించి మెప్పించింది.

2021లో ఖత్రోన్ కె ఖిలాడీ 11వ సీజన్లో పాల్గొంది సనా మక్బుల్. ఇందులో సెమీ ఫైనల్స్ వరకు వెళ్లింది ఈ బ్యూటీ. ఈ ఏడాది హిందీలో బిగ్ బాస్ ఓటీటీ మూడో సీజన్ విజేతగా నిలిచింది. తెలుగులో రెండు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీకి ఆ తర్వాత అంతగా ఆఫర్స్ రాలేదు.

ఇది చదవండి : Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‏గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..

Tollywood: ఫోక్ సాంగ్‏తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్‏గా అదరగొట్టేసింది..

Tollywood: అమ్మడు ఇది నువ్వేనా.. ఈ రేంజ్ ఛేంజ్ ఏంటమ్మా.. దృశ్యంలో వెంకీ కూతురు చూస్తే మైండ్ బ్లాంకే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..