Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‏గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..

తెలుగు సినీరంగంలో తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుని తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన తారల గురించి చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రాకపోయినా.. చిన్న సినిమాలతోనే బాగా పాపులర్ అవుతుంటారు. పేడౌట్ అయిన కూడా కొన్ని సినిమాలతో ఆడియన్స్ వారిని అంత ఈజీగా మర్చిపోలేరని చెప్పవచ్చు. అందులో ఈ హీరోయిన్ కూడా ఒకరు.

Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‏గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..
Abhirami
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 29, 2024 | 5:10 PM

టాలీవుడ్ హీరో వేణు ఒకప్పుడు ఫ్యామిలీ అడియన్స్ ఫేవరెట్ హీరో. విభిన్నమైన కంటెంట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. స్వయంవరం వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన వేణు కెరీర్‏లో మరో హిట్ మూవీ చెప్పవే చిరుగాలి. విక్రమన్ దర్శకత్వం వహించిన ఈమూవీలో తొట్టెంపూడి వేణు హీరోగా నటించగా.. అభిరామి, ఆషిమా భల్లా హీరోయిన్లుగా కనిపించారు. ఇక సునీల్, బేతా సుధాకర్, ఎల్బీ శ్రీరామ్, కృష్ణ భగవాన్, కైకాల సత్యనారాయణ కీలకపాత్రలు పోషించారు. అప్పట్లో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. అలాదే ఈ సినిమాతో తెలుగులో చాలా ఫేమస్ అయ్యింది హీరోయిన్ అభిమాని. చెప్పవే చిరుగాలి చిత్రంలో సాఫ్ట్, ట్రెడిషనల్ గా కనిపించే అమ్మాయి పాత్రలో తనదైన నటనతో మెప్పించి అడియన్స్ హృదయాలను కొల్లగొట్టింది.

చెప్పవే చిరుగాలి సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న అభిరామి.. ఆ తర్వాత థాంక్యూ సుబ్బరావ్, చార్మినార్ వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఆ సినిమాలతో ఆమెకు సరైన క్రేజ్ రాలేదు. 2000 వరకు తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటించిన అభిరామి.. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. దీంతో ఆమె సినీరంగానికి దూరమయ్యింది. దాదాపు పదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె 2014లో మలయాళం సినిమా ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస చిత్రాలతో దూసుకుపోతుంది.

ప్రస్తుతం హీరోయిన్‍గా కాకుండా అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో తల్లి పాత్రలో కనిపించారు. ప్రస్తుతం తెలుగు, తమిళంలో వరుస సినిమాల్లో నటిస్తుంది. అలాగే అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ నెట్టింట తెగ సందడి చేస్తుంది. అభిరామి లేటేస్ట్ ఫోటోస్ చూసిన నెటిజన్స్ న్యాచురల్ బ్యూటీ విత్ యాక్టింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Abhirami (@abhiramiact)

ఇది చదవండి : Santhosham Movie : నాగార్జున సంతోషం మూవీ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు గుర్తుపట్టడం కష్టమే..

Arjun Reddy: తస్సాదియ్యా.. ఏం మేకోవర్ భయ్యా.. ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీని ఇప్పుడు చూస్తే ప్రేమలో పడాల్సిందే..

Jr.NTR: వార్ 2 నుంచి ఎన్టీఆర్ ఫోటో లీక్.. మాస్ అండ్ రగ్గడ్‍ లుక్‏లో తారక్.. వేరేలెవల్ అంతే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.