Jr.NTR: వార్ 2 నుంచి ఎన్టీఆర్ ఫోటో లీక్.. మాస్ అండ్ రగ్గడ్‍ లుక్‏లో తారక్.. వేరేలెవల్ అంతే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు మరోసారి నార్త్ అడియన్స్ ముందుకు వస్తున్నారు. ట్రిపుల్ ఆర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తారక్.. ఇటీవలే దేవర సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇప్పుడు వార్ 2 సినిమాతో మరోసారి సందడి చేయనున్నారు.

Jr.NTR: వార్ 2 నుంచి ఎన్టీఆర్ ఫోటో లీక్.. మాస్ అండ్ రగ్గడ్‍ లుక్‏లో తారక్.. వేరేలెవల్ అంతే..
Jrntr
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 26, 2024 | 9:42 AM

ఇటీవలే దేవర సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. మాస్ అండ్ యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలు బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత తారక్ వార్ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీతోనే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు తారక్. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఎన్టీఆర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ మూవీతో నార్త్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తారక్.. ఇప్పుడు వార్ 2 సినిమాతో మరోసారి బీటౌన్ ప్రేక్షకులను అలరించనున్నారు. అయితే ఇదివరకే ఈ మూవీ షూటింగ్ లో పాల్గొన్న తారక్.. ఇప్పుడు యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాలో తారక్ లుక్ నెట్టింట వైరలవుతుంది.

ఈ చిత్రంలో తారక్ స్పై ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ రోల్ పూర్తిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై వార్ 2 ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. కనీసం ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. అయితే ఈ మూవీలో తారక్ లుక్ గురించి ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో వార్ 2 సెట్స్ నుంచి ఎన్టీఆర్ ఫోటోస్ లీక్ అయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నప్పుడు ఎవరో తీసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. అందులో తారక్ బ్రౌన్ కలర్ టీ షర్ట్, ఆర్మీ షర్ట్ వేసుకుని నడుస్తూ కనిపిస్తున్నారు. మాస్ లుక్ లో ఎన్టీఆర్ వేరేలెవల్లో ఉన్నారంటూ ఫ్యాన్స్ ఆ ఫోటోస్ తెగ షేర్ చేస్తున్నారు.

వార్ 2లో తారక్ లుక్ అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ మూవీ చూసేందుకు ఇటు టాలీవుడ్ అడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్ట్ 14న రిలీజ్ చేయనున్నారు.

ఇది చదవండి :  Ram Charan: అప్పుడేమో క్యూట్‏గా.. ఇప్పుడేమో హాట్‏గా.. చరణ్ చెల్లిగా నటించిన ఈ బ్యూటీని ఇప్పుడు చూస్తే..

Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సెషన్ అయిన నీలికళ్ల సుందరి.. అదృష్టం కలిసిరాని వయ్యారి.. ఎవరంటే..

Nadhiya : ద్యావుడా.. అందంలో తల్లిని మించిపోయిన కూతుళ్లు.. నదియా డాటర్స్ ఎంత అందంగా ఉన్నారో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?