Santhosham Movie : నాగార్జున సంతోషం మూవీ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు గుర్తుపట్టడం కష్టమే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ మూవీతోనే పాపులర్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా నార్త్ కు చెందిన కొందరు హీరోయిన్స్.. తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. కానీ ఆ తర్వాత మాత్రం అనుకున్నంతగా సినిమాల్లో నటించలేకపోయారు. అందులో గ్రేసీ సింగ్ ఒకరు. ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే. కానీ నాగార్జున నటించిన సంతోషం సినిమా హీరోయిన్ అంటే ఠక్కున గుర్తుపడతారు.

Santhosham Movie : నాగార్జున సంతోషం మూవీ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు గుర్తుపట్టడం కష్టమే..
Santhosham Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 26, 2024 | 1:08 PM

అక్కినేని నాగార్జున నటించిన హిట్ చిత్రాల్లో సంతోషం ఒకటి. ఇప్పటికీ ఫ్యామిలీ అడియన్స్ ఫేవరేట్ చిత్రాల్లో ముందుంటుంది ఈ మూవీ. అందమైన ప్రేమకథతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధఇంచింది. డైరెక్టర్ దశరథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆర్పీ. పట్నాయక్ అందించిన మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు. అద్భుతమైన సంగీతంతో ఈ చిత్రాన్ని అప్పట్లోనే మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్ గా చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రానికి ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఇందులో నాగార్జున సరసన శ్రియ, గ్రేసీ సింగ్ హీరోయిన్లుగా నటించగా.. పృథ్వీరాజ్, ప్రభుదేవా కీలకపాత్రలు పోషించారు.

ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి ఆ తర్వాత తెలుగులో ఆఫర్స్ వచ్చాయి. అలాగే ఈ మూవీల హోమ్లీగా.. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది గ్రేసీ సింగ్. ఈ చిత్రంతో తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీకి ఆ తర్వాత మాత్రం అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. సంతోషం సినిమా తర్వాత తప్పు చేసి పప్పుకూడు సినిమాలో నటించింది. ఆ తర్వాత రామ రామ కృష్ణ కృష్ణ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు.

కానీ ఎక్కువగా హిందీ చిత్రాల్లో నటించింది. అమీర్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ లగాన్ చిత్రంలో నటించింది. అలాగే మున్నాభాయ్ ఎంబీబీఎస్ మూవీలోనూ మెరిసింది. నటిగానే కాకుండా ఆమె భరతనాట్యం, ఒడిస్సీ నృత్యకారిణి. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న గ్రేసీ సింగ్ ఇప్పుడు బుల్లితెరపై సందడి చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా గ్రేసీ సింగ్ ఫ్యామిలీ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Gracy Singh (@iamgracysingh)

ఇది చదవండి :  Ram Charan: అప్పుడేమో క్యూట్‏గా.. ఇప్పుడేమో హాట్‏గా.. చరణ్ చెల్లిగా నటించిన ఈ బ్యూటీని ఇప్పుడు చూస్తే..

Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సెషన్ అయిన నీలికళ్ల సుందరి.. అదృష్టం కలిసిరాని వయ్యారి.. ఎవరంటే..

Nadhiya : ద్యావుడా.. అందంలో తల్లిని మించిపోయిన కూతుళ్లు.. నదియా డాటర్స్ ఎంత అందంగా ఉన్నారో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?