- Telugu News Photo Gallery Cinema photos Rocking Star Yash opens up on KGF 3, toxic and Ramayana in Tollywood, Details Here, Telugu Heroes Photos
Yash: యశ్ ప్లాన్ అదిరిందిగా.. ఇక దూకుడే.! ఈసారి పాన్ వరల్డ్ దద్దరిల్లిపోవాల్సిందే..
కేజియఫ్ 2 తర్వాత యశ్ ఏం చేస్తున్నాడు..? ప్రైమ్ టైమ్ అంతా వేస్ట్ చేసుకుంటున్నాడు. ఎందుకు సినిమాలు చేయట్లేదు..? ఒక్క సినిమాపై ఎందుకంత టైమ్ తీసుకుంటున్నాడు అంటూ ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా బాగా హర్ట్ అయ్యారు. అన్ని ప్రశ్నలకు ఒకేసారి సమాధానం ఇచ్చారు రాకింగ్ స్టార్. ఒకేసారి మూడు సినిమాలతో రాబోతున్నారీయన. కొందరు హీరోలకు కొన్ని సినిమాలు ఐకానిక్‌గా అలా ఉండిపోతాయి.
Updated on: Oct 26, 2024 | 6:13 PM

కేజియఫ్ 2 తర్వాత యశ్ ఏం చేస్తున్నాడు..? ప్రైమ్ టైమ్ అంతా వేస్ట్ చేసుకుంటున్నాడు. ఎందుకు సినిమాలు చేయట్లేదు..? ఒక్క సినిమాపై ఎందుకంత టైమ్ తీసుకుంటున్నాడు అంటూ ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా బాగా హర్ట్ అయ్యారు.

అన్ని ప్రశ్నలకు ఒకేసారి సమాధానం ఇచ్చారు రాకింగ్ స్టార్. ఒకేసారి మూడు సినిమాలతో రాబోతున్నారీయన. కొందరు హీరోలకు కొన్ని సినిమాలు ఐకానిక్‌గా అలా ఉండిపోతాయి. ప్రభాస్‌కు బాహుబలి.. అల్లు అర్జున్‌కు పుష్ప.. యశ్‌కు కేజియఫ్.

ఈ సినిమాలతో తమ ఇండస్ట్రీలో కాదు.. పక్క ఇండస్ట్రీల్లోనూ జెండా పాతారు వీళ్ళంతా. ఈ ఇమేజ్‌ను బట్టే వాళ్ల కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు. యశ్ కూడా అంతే. ప్రస్తుతం ఈయన మూడు సినిమాలు చేస్తున్నారు.

కేజియఫ్ 2 వచ్చి రెండేళ్ళైపోయింది. ఈ గ్యాప్‌లో సలార్‌తో వచ్చారు ప్రశాంత్ నీల్. ఆయన మరో రెండు మూడు సినిమాలు కూడా చేస్తున్నారు. కానీ యశ్ నుంచి కనీసం మరో అప్‌డేట్ రాలేదు. టాక్సిక్ సినిమా చేస్తున్నారు కానీ దానిపై అప్‌డేట్ లేదు.

అది ఆగిపోయిందనే ప్రచారం కూడా జరిగింది. దీనిపై క్లారిటీ ఇచ్చారు యశ్. టాక్సిక్ ఈజ్ ఆన్ అనేసారు రాకింగ్ స్టార్. గీతూ మోహన్‌దాస్ చెప్పిన కథకు తాను స్పెల్ బౌండ్ అయిపోయానని చెప్పారు యశ్.

ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుందని తెలిపారు. అలాగే రామాయణ్ గురించి ఓపెన్ అయ్యారు యశ్. ఇందులో తాను రావణుడిగా నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేసారు.

అంతేకాదు.. రామాయణ్ సినిమాను తాను కో ప్రొడ్యూస్ చేస్తున్నట్లు తెలిపారు యశ్. నితీష్ తివారి వచ్చి కథ చెప్పినపుడు.. రావణుడి పాత్రను ఉన్నదున్నట్లు తీస్తే తాను నటిస్తానని చెప్పినట్లు తెలిపారు యశ్.

వాళ్ళ విజన్ నచ్చి తను కూడా ఈ చిత్రంలో భాగమయ్యానని.. రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి సీతగా కనిపిస్తున్నారని తెలిపారు యశ్. అలాగే కేజియఫ్ 3 కూడా ఉంటుందని మరోసారి క్లారిటీ ఇచ్చారీయన.




