AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అబ్బా ఎంత మంచి దొంగలో.. చోరి చేద్దామని వచ్చారు! కానీ తీరా చూస్తే..

దొంగల్లో మంచి దొంగలు, చెడ్డ దొంగలు కూడా ఉంటారా అనే ప్రస్తావన వస్తే.. ఉంటారనడానికి ఇక్కడ జరిగిన సంఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ఎందుకంటే ఇంట్లో చోరి కోసం వచ్చిన కొందరు వ్యక్తులు అందినకాడికి దోసుకున్నారు. తీర ఆ కుటుంబ పరిస్థితి తెలుసుకొని ఆ వ్యక్తులు చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు. ఇంతకూ ఆ దొంగలు ఏం చేశారో తెలుసుకుందాం పదండి.

Telangana: అబ్బా ఎంత మంచి దొంగలో.. చోరి చేద్దామని వచ్చారు! కానీ తీరా చూస్తే..
Thieves Return Stolen Goods
N Narayana Rao
| Edited By: |

Updated on: Mar 01, 2026 | 3:06 PM

Share

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చిమనాతండాకు చెందిన గూగులోతు వీరు అనే వ్యక్తి ఇంట్లో ఇటీవల దొంగతనం జరిగింది. అర్థరాత్రి ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు బీరువాలో ఉన్న నాలుగు తులాల బంగారం, 30 తులాల వెండి 1,30,000 నగదును ఎత్తుకెళ్లారు. అయితే ఉదయం బీరువాలో ఉన్న బంగారం, డబ్బు కనిపించకపోయే సరికి బాధితుడు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అయితే కూలి పని చేస్తే గాని ఇళ్లు గడవని పరిస్థితిలో బాధితుడు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. రోజువారీ కూలీ పనులు చేస్తేనే పూట గడుస్తుందట. ఇలా ఎళ్లకాలం కష్టపడి కొంత డబ్బులు, బంగారాన్ని కూడబెట్టుకున్నామని.. అది కూడా కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఖర్చులు కోసం ఉపయోగించుకోవాలనుకున్నామని బాధిత ఫ్యామిలీ చెబుతోంది. తాము ఎళ్లకాలం కష్టపడిన సంపాదన అంత ఒక్క రాత్రిలోనే ఆవిరి అయిపోవడంతో ఆ కుటుంబ కన్నీరు మున్నీరుగా విలపించింది.

అయితే దొంగతనం జరిగిన మరుసటి రోజు తెల్లావారేసరికి బాధితుడు వీరు ఇంటి ఆవరణలో ఓ కవర్‌ కనిపించింది. అదేంటని కుటుంబ సభ్యులు ఓపెన్ చేసి చూడగా అందులో 30 తులాల వెండి, పదివేల నగదు, కొన్ని బంగారు ఆభరణాలు కనిపించాయి. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసిన పోలీసులతో సహా స్థానిక గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు.

నిందితులు పోలీసులకు దొరుకుతామనే భయంతో ఇలా చేసి ఉంటారా అనే ప్రశ్నలు తలెత్తాయి. కానీ అలా బయపడి ఉంటే మొత్తం సొమ్మును వదిలి వెళ్లే వారు కదా.. ఇలా కొంత సొమ్మును మాత్రమే వదిలి వెళ్లారు అంటే ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొనే దోచుకున్న సోత్తులో కొంత మొత్తాన్ని తిరిగి మళ్లీ అదే ఇంటి ఆవరణలో వదిలి వెళ్లి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. మొత్తానికి దొంగలే ఆయినా వారిలో కూడా ఎంతో కొంత మానవత్వం ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us