Raghava lawrence: రాఘవ లారెన్స్ మంచి మనసుపై ప్రశంసలు.. అలాంటి వారికి అండగా సౌత్ హీరో..

రాఘవ లారెన్స్.. సౌత్ ఇండస్ట్రీలో మల్టీటాలెంటెడ్ స్టార్. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, కొరియోగ్రాఫర్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఈరోజు రాఘవ లారెన్స్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Raghava lawrence: రాఘవ లారెన్స్ మంచి మనసుపై ప్రశంసలు.. అలాంటి వారికి అండగా సౌత్ హీరో..
Dulquer Salman
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 29, 2024 | 4:29 PM

దక్షిణాది చిత్రపరిశ్రమలో నటుడిగా, కొరియోగ్రాఫర్ గా, దర్శకనిర్మాతగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు రాఘవ లారెన్స్. ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ స్టార్. కానీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే విషయాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోని స్టార్ హీరో. తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్.. నిజ జీవితంలోనూ సూపర్ హీరో అన్న సంగతి తెలిసిందే. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సామాజిక సేవ చేయడంలోనూ ముందుంటారు. ఇప్పటికే ఆయన ఫౌండేషన్ ద్వారా పేదలు, రైతులకు సాయం అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు వికలాంగులు, రైతులు అవసరమైన ట్రాక్టర్స్, త్రీవీలర్స్ అందజేశారు. కష్టాల్లో ఉన్న అభిమానులకు తనవంతూ సాయం చేస్తూ వారికి అండగా నిలుస్తుంటారు.

ఇక ఈరోజు (అక్టోబర్ 29) రాఘవ లారెన్స్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పేద వితంతు మహిళలకు అండగా నిలిచారు. కొంతమంది వితంతు మహిళలకు అండగా నిలిచారు. వారికి కుట్టు మిషన్స్ అందించి వారి కళ్లలో ఆనందం నింపారు. ఆ విధంగా సాయం అందించి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు లారెన్స్. ఇది చూసిన నెటిజన్స్ రాఘవ లారెన్స్ మంచి మనసుపై ప్రశంసుల కురిపిస్తున్నారు.

ప్రస్తుతం రాఘవ లారెన్స్ కాల భైరవ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. తెలుగు, తమిళం, హిందీ భాషలలో భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేయనున్నారు. వచ్చే నెల నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. 2025 వేసవిలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

ఇది చదవండి : Santhosham Movie : నాగార్జున సంతోషం మూవీ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు గుర్తుపట్టడం కష్టమే..

Arjun Reddy: తస్సాదియ్యా.. ఏం మేకోవర్ భయ్యా.. ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీని ఇప్పుడు చూస్తే ప్రేమలో పడాల్సిందే..

Jr.NTR: వార్ 2 నుంచి ఎన్టీఆర్ ఫోటో లీక్.. మాస్ అండ్ రగ్గడ్‍ లుక్‏లో తారక్.. వేరేలెవల్ అంతే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!