Dulquer Salmaan: అది నా కల.. అలా జరిగితే ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకుంటా.. హీరో దుల్కర్ సల్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు దుల్కర్ సల్మాన్. మలయాళం ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించిన ఈ హీరోకు ఇప్పుడు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు లక్కీ భాస్కర్ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నాడు.
మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కు సౌత్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మలయాళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ హీరో.. ఇప్పుడు తెలుగులోనూ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటున్నారు. మహానటి, సీతారామం సినిమాలతో టాలీవుడ్ అడియన్స్ కు దగ్గరైన దుల్కర్ సల్మాన్.. తాజాగా లక్కీ భాస్కర్ సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేయబోతున్నారు. డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా దీపావళీ కానుకగా అక్టోబర్ 31న విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా చిత్రయూనిట్ మొత్తం సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో దుల్కర్ సల్మాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముందుగా ప్రొడ్యూసర్ నాగవంశీ మాట్లాడుతూ.. లక్కీ భాస్కర్ సినిమా ఫస్ట్ డే రూ.100 కోట్లు కలెక్ట్ చేయొచ్చు అన్నారు. అయితే ఈ మాటలపై హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. “నాది 13 ఏళ్ల కెరీర్. ఇప్పటివరకు దాదాపు 40 సినిమాలు చేశాను. వంద కోట్ల కలెక్షన్స్ అనేది నాకు కల. నిజంగా లక్కీ భాస్కర్ సినిమా మొదటి రోజు రూ.100 కోట్లు కలెక్ట్ చేస్తే నాగవంశీ ఫోటో ఫ్రేమ్ చేయించి మా ఇంట్లో పెట్టుకుంటా. నా సినిమా వంద కోట్లు సాధిస్తే నాకంటే ఎక్కువగా ఆనంధించే వ్యక్తి ఈభూమి మీద ఉండరు” అని అన్నారు. దీంతో దుల్కర్ సల్మాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.
ప్రస్తుతం భారతీయ సినీరంగంలో రూ.100 కోట్లు కలెక్షన్ అనేది చాలా కామన్ అయిపోయింది. కొందరు హీరో రెండు రోజుల్లో రూ. 100 కోట్లు రాబడితే.. స్టార్ హీరోస్ ఫస్ట్ డే వంద కోట్ల కలెక్షన్ రాబడుతున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న చిన్న సినిమాలతో వస్తోన్న యంగ్ స్టార్స్ కూడా రూ.100 కోట్ల గ్రాస్ సాధిస్తున్నారు. ఒక్కరోజులో రూ.100 కోట్లు పైగా గ్రాస్ సాధించే స్టార్స్ గురించి తెలిసిందే. కానీ దుల్కర్ సల్మాన్ మాత్రం ఇప్పటివరకు తెలుగు, మలయాళంలో హిట్స్ అందుకుంటున్నప్పటికీ వంద కోట్ల కలెక్షన్స్ మాత్రం రాబట్టలేదు.
ఇది చదవండి : Santhosham Movie : నాగార్జున సంతోషం మూవీ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు గుర్తుపట్టడం కష్టమే..
Jr.NTR: వార్ 2 నుంచి ఎన్టీఆర్ ఫోటో లీక్.. మాస్ అండ్ రగ్గడ్ లుక్‌లో తారక్.. వేరేలెవల్ అంతే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.