AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అమ్మడు ఇది నువ్వేనా.. ఈ రేంజ్ ఛేంజ్ ఏంటమ్మా.. దృశ్యంలో వెంకీ కూతురు చూస్తే మైండ్ బ్లాంకే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకే ఒక్క సినిమాతో ఫేమస్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కేవలం కథానాయికలు మాత్రమే కాకుండా సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్, స్టార్ హీరోల కూతుర్లుగా కనిపించిన తారలు కూడా పాపులర్ అయ్యారు. దృశ్యం సినిమా గుర్తుందా... అందులో వెంకీ పెద్ద కూతురిగా కనిపించిన అమ్మాయి ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

Tollywood: అమ్మడు ఇది నువ్వేనా.. ఈ రేంజ్ ఛేంజ్ ఏంటమ్మా.. దృశ్యంలో వెంకీ కూతురు చూస్తే మైండ్ బ్లాంకే..
Kruthika Jayakumar
Rajitha Chanti
|

Updated on: Oct 29, 2024 | 7:36 PM

Share

విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో దృశ్యం. 2014లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన దృశ్యం సినిమాకు రీమేక్ ఇది. ఈ చిత్రానికి జీతూ జోసేఫ్ దర్శకత్వం వహించగా.. ఇందులో వెంకటేశ్, మీనా జంటగా నటించారు. ఈ సినిమాలో వెంకీ పెద్ద కూతురుగా నటించిన అమ్మాయి గుర్తుందా.. ? సినిమా కథ మొత్తం ఆ అమ్మాయి చుట్టే తిరుగుతుంది. ఈ చిత్రంలో అందం.. అమాయకత్వం.. తనదైన నటనతో కట్టిపడేసింది. దృశ్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత మాత్రం సినిమాల్లో కనిపించలేదు. దృశ్యం సినిమాతోపాటు.. ఆ తర్వాత వచ్చిన సీక్వెల్ లోనూ కనిపించి అలరించింది ఈబ్యూటీ. ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటో తెలుసా.. ? తన పేరు కృతిక జయకుమార్. ఆమె ఓ క్లాసికల్ డ్యాన్సర్.

కృతిక జయకుమార్.. బెంగళూరుకు చెందిన అమ్మాయి. క్లాసికల్ డ్యాన్సర్. మొదటి నుంచి సినిమాలకు దూరంగానే ఉండేది. ఏడేళ్ల వయసులోనే భరతనాట్యం పై ఇష్టం పెంచుకున్న కృతిక.. ఆ తర్వాత క్లాసికల్ డ్యాన్సర్ గా పలు షోలలో ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అలా తిరువనంతపురంలో మలయాళం డైరెక్టర్ బాలు కిరియత్ ఆమెను చూసి సినిమాల్లో ట్రై చేయాలని సూచించారు. అలా తెలుగులో దృశ్యం సినిమాకు అడిషన్ కు వెళ్లిన కృతికకు అదే చిత్రంలో ఛాన్స్ వచ్చింది.

దృశ్యం సినిమాతోనే సినీరంగంలోకి అడుగుపెట్టిన కృతిక.. ఆ తర్వాత కన్నడంలో బాక్సర్ సినిమాలో నటించింది. తెలుగులో వినవయ్య రామయ్య చిత్రంలో కనిపించింది. రోజలు మారాయి, ఇంట్లో దెయ్యం నాకేం భయం వంటి చిత్రాల్లో నటించినప్పటికీ సరైన క్రేజ్ రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.

ఇది చదవండి : Santhosham Movie : నాగార్జున సంతోషం మూవీ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు గుర్తుపట్టడం కష్టమే..

Arjun Reddy: తస్సాదియ్యా.. ఏం మేకోవర్ భయ్యా.. ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీని ఇప్పుడు చూస్తే ప్రేమలో పడాల్సిందే..

Jr.NTR: వార్ 2 నుంచి ఎన్టీఆర్ ఫోటో లీక్.. మాస్ అండ్ రగ్గడ్‍ లుక్‏లో తారక్.. వేరేలెవల్ అంతే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
పరస్పర అంగీకార విడాకులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
పరస్పర అంగీకార విడాకులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
ఉత్కంఠగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్.. టైటిల్ విన్నర్ ఫిక్స్!
ఉత్కంఠగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్.. టైటిల్ విన్నర్ ఫిక్స్!
రూ.6 లక్షల జీతంతో.. RBIలో ఉద్యోగాలు! రాత పరీక్ష లేకుండానే ఎంపిక
రూ.6 లక్షల జీతంతో.. RBIలో ఉద్యోగాలు! రాత పరీక్ష లేకుండానే ఎంపిక
రూ.40 లక్షలు దోచుకున్నాక మళ్ళీ అదే బెదిరింపు.. కట్ చేస్తే..
రూ.40 లక్షలు దోచుకున్నాక మళ్ళీ అదే బెదిరింపు.. కట్ చేస్తే..
ఏంటీ.. ధురంధర్ సినిమా డైరెక్టర్ భార్య తెలుగులో హీరోయినా.. ?
ఏంటీ.. ధురంధర్ సినిమా డైరెక్టర్ భార్య తెలుగులో హీరోయినా.. ?