IND vs NZ: న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్‌కు ముందే బుమ్రాకు ఐసీసీ భారీ షాక్.. ఇది అసలు ఊహించలేదుగా..
నవంబర్ 1 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ లో స్థానం నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్ లో గెలవడ టీమిండియాకు చాలా కీలకం. అయితే ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
ఐసీసీ లేటెస్ట్ టెస్టు ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఈ ర్యాంకింగ్‌లో బుమ్రా మొదటి స్థానాన్నికోల్పోయాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి 2 మ్యాచ్‌ల్లో బుమ్రా పెద్దగా సత్తా చాటలేకపోయాడు. దీంతో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడా బుమ్రాను అధిగమించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఈ దక్షిణాఫ్రికా బౌలర్ ఇప్పటివరకు అద్భుత ప్రదర్శన చేశాడు. పుణె వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో జస్ప్రీత్ బుమ్రాకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. దీంతో బుమ్రా తొలి స్థానం కోల్పోవాల్సి వచ్చింది. బుమ్రా 2 స్థానాలు చేజార్చుకున్నాడు. బుమ్రా నేరుగా మూడో స్థానానికి పడిపోయాడు. కగిసో రబాడ నంబర్ 1 బౌలర్‌గా నిలిచాడు. కొద్ది రోజుల క్రితమే కగిసో రబడ టెస్టు క్రికెట్‌లో 300 వికెట్లు పూర్తి చేసుకున్నాడు.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్‌లో పర్యటిస్తోంది. బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా మధ్య 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగుతోంది. దక్షిణాఫ్రికా 10 ఏళ్ల తర్వాత ఆసియాలో తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించింది. కగిసో రబడ దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో రబడ తొలి ఇన్నింగ్స్‌లో 3, రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు మొత్తం 9 వికెట్లు తీశాడు.
మూడో ప్లేస్ కు పడిపోయిన జస్ ప్రీత్ బుమ్రా..
New World No.1 🥇
South Africa’s star pacer dethrones Jasprit Bumrah to claim the top spot in the ICC Men’s Test Bowling Rankings 👇https://t.co/oljRIUhc5T
— ICC (@ICC) October 30, 2024
అయితే ఈ ర్యాంకింగ్‌లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరింత టాప్ లోకి దూసుకెళ్లాడు. ప్రస్తుతం అతను మూడో ప్లేస్ లో కొనసాగుతున్నాడు. ఇక పంత్ ఏకంగా 5 స్థానాలు కోల్పోయి వరుసగా ఆరో స్థానం నుంచి పదకొండో ర్యాంక్‌కు ఎగబాకాడు. విరాట్ కోహ్లి 6 స్థానాలు దిగజారి 14వ స్థానానికి చేరుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 9 స్థానాలు కోల్పోయాడు. రోహిత్ 24వ స్థానానికి పడిపోయాడు. కాగా శుభమ్ గిల్ 19వ స్థానం నుంచి 20వ స్థానానికి చేరుకున్నాడు.
Yashasvi Jaiswal moves to third place in the latest ICC Test rankings for bowlers ✅ Kagiso Rabada becomes the number one bowler in the ICC Test bowling rankings ✅#YashasviJaiswal #JoeRoot #KaneWilliamson #SteveSmith #RachinRavindra #KagisoRabada #JaspritBumrah #INDvsNZ… pic.twitter.com/St0VxIoAEA
— SBM Cricket (@Sbettingmarkets) October 30, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..