AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudheep- PM Modi: ‘మీ మాటలు ధైర్యాన్నిచ్చాయి మోదీజీ’.. ప్రధాని లేఖపై స్పందించిన హీరో సుదీప్

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తల్లి సరోజా సంజీవ్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె ఈనెల 20వ తేదీన తుదిశ్వాస విడిచారు. తల్లి మరణంతో సుదీప్ తో పాటు అతని కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

Sudheep- PM Modi: 'మీ మాటలు ధైర్యాన్నిచ్చాయి మోదీజీ'.. ప్రధాని లేఖపై స్పందించిన హీరో సుదీప్
PM Narendra Modi, Kichcha Sudheep
Basha Shek
|

Updated on: Oct 28, 2024 | 7:38 PM

Share

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇంట్లో ఇటీవల ఒక విషాదం చోటు చేసుకుంది. అతని తల్లి సరోజా సంజీవ్ అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కాగా తన తల్లిని కోల్పోయిన బాధ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నాడు సుదీప్. ఈ నేపథ్యంలో అతనికి ధైర్యం చెబుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఓ లేఖను పంపించారు. దీనిని సోషల్ మీడియాలో షేర్ చేసిన సుదీప్ ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘మీ తల్లి సరోజా సంజీవ్ మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆమె లోటు పూడ్చలేనిది. అమ్మ గొప్ప మనసును వర్ణించలేం. నువ్వు భావోద్వేగానికి గురైన క్షణాలు చూస్తుంటే ఆమెతో నీకున్న అనుబంధం.. నీపై ఆమె ప్రభావం ఎంత ఉందో అర్థమవుతోంది. జ్ఞాపకాల రూపంలో ఆమె ఎప్పటికీ జీవించే ఉంటారు. ఆమె నేర్పించిన విలువలు నీలో స్ఫూర్తి నింపుతూనే ఉండాలి. జీవితంలో ఇదొక క్లిష్ట సమయం. దీనిని అధిగమించే ధైర్యాన్ని ఆ భగవంతుడు నీకు, కుటుంబసభ్యులకు అందించాలని ప్రార్థిస్తున్నా. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని ప్రధాని మోదీ లేఖలో పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన సుదీప్ ‘గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు.. మీ సంతాప లేఖకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ క్లిష్ట సమయంలో మీ ఆలోచనాత్మకమైన మాటలు నా మనసును తాకాయి. నాకెంతో ధైర్యాన్ని, ఓదార్పును ఇచ్చాయి. మీరు చూపించిన ఈ ప్రేమ ఎప్పటికీ గుర్తుంటుంది’ అని రిప్లై ఇచ్చారు కిచ్చా సుదీప్.

ఇవి కూడా చదవండి

సుదీప్ కు  ప్రధాని రాసిన లేఖ..

. తన తల్లి మరణం తరువాత, కిచ్చా సుదీప్ సినిమా, బిగ్ బాస్ షూటింగుల నుండి విరామం తీసుకున్నాడు. గత వారాంతంలో బిగ్ బాస్ ఎపిసోడ్‌కి సుదీప్ హోస్ట్ చేయలేదు. సరోజా సంజీవ్ మరణ వార్తను బిగ్ బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్స్‌కు కూడా తెలియజేశారు. విషయం తెలియగానే అందరూ కంటతడి పెట్టారు.

కిచ్చా సుదీప్ ఎమోషనల్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్