Jani Master: ఇది కదా జానీ మాస్టర్ అంటే .. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించేందుకు ఏం చేశాడంటే?

లైంగిక వేధింపుల ఆరోపణలతో అపఖ్యాతి పాలయ్యాడు జానీ మాస్టర్. ఈ కారణంగానే అతని చేతిలో ఉన్న సినిమా అవకాశాలు కూడా చేజారిపోయాయి. జనసేన పార్టీ కూడా జానీ ప్రాథమిక సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ తన గొప్ప మనసును చాటుకున్నాడు జానీ మాస్టర్.

Jani Master: ఇది కదా జానీ మాస్టర్ అంటే .. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించేందుకు ఏం చేశాడంటే?
Jani Master
Follow us

|

Updated on: Oct 27, 2024 | 10:29 PM

తన దగ్గర పనిచేసిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటోన్న జానీ మాస్టర్ ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో శుక్రవారం (అక్టోబర్ 25) చంచల్ గూడ జైలు నుంచి బయటకు వచ్చాడు జానీ. కాగా లైంగిక వేధింపుల ఆరోపణల్లో చిక్కుకున్న జానీ మాస్టర్ ను చాలామంది ద్వేషిస్తున్నారు. అతనికి బెయిల్ ఇవ్వాల్సింది కాదంటూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అయితే ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ తన గొప్ప మనసును చాటుకున్నాడు జానీ మాస్టర్. ఒక మంచి పని చేసి తన అభిమానులు, నెటిజన్ల మనసులు గెల్చుకున్నాడు. ఇంతకు ఏం జరిగిందంటే.. జైలు నుంచి విడుదలైన జానీ మాస్టర్ హైదరాబాద్ నుంచి తన కుటుంబ సభ్యులతో కలిసి నెల్లూరుకు పయనమయ్యాడు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం, బ్రాహ్మణపల్లి సమీపానికి వచ్చే సరికి ఓ పెద్దాయన రోడ్డు మీద తీవ్రమైన గాయాలతో పడి ఉన్నాడు. ఎవరైనా వచ్చి తనను కాపాడితే బాగుండు అనుకుంటున్న సమయంలోనే అటుగా జానీ మాస్టర్ వచ్చాడు. గాయపడిన పెద్దాయనను చూశారు. ముందుగా ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆ వెంటనే 108కి ఫోన్ చేశారు.

ఇవి కూడా చదవండి

జానీ మాస్టర్ ఫోన్ చేసిన కొద్ది సేపటికే 108 అంబులెన్స్ వచ్చింది. అప్పటివరకూ ఆ పెద్దాయన దగ్గరే ఉన్న జానీ మాస్టర్.. స్వయంగా ఆయన్ని అంబులెన్స్‌లో తరలించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమా్ల్లో వైరల్ గా మారాయి. జానీ మాస్టర్ చేసిన పనిని అభిమానులు, నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. తాను సమస్యల్లో ఉన్నా.. ఎవరో తెలియని వ్యక్తికి సాయం చేయడం, ఎదురు చూసి మరీ అంబులెన్స్ లో పంపించడంతో మాస్టర్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..