జానీ మాస్టర్
జానీ మాస్టర్ (షేక్ జానీ బాషా) టాలీవుడ్‌కి చెందిన ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్. ఆయన తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ సినిమాలకు సైతం కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జానీ మాస్టర్ స్వస్థలం. బుల్లితెరపై రియాల్టీ డ్యాన్స్ షో ద్వారా డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించారు. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా ద్రోణ (2009) మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చారు. 2012లో రాంచరణ్ హీరోగా చేసిన రచ్చ మూవీతో పాటు.. ఆ తర్వాత వచ్చిన పలు రాంచరణ్ సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా ఉన్నాడు. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ పోతినేని, రవితేజ తదితర హీరోల మూవీస్‌కు కొరియోగ్రాఫర్‌గా పనిచేశాడు. 2020లో అల వైకుంఠపురం సినిమాలో బుట్ట బొమ్మా పాటకు కొరియోగ్రఫీతో అందరి ప్రశంసలు అందుకున్నారు. 2024లో పవన్ కల్యాణ్ సమక్షంలో జానీ మాస్టర్ జనసేన పార్టీలో చేరారు. ఏపీలో జరిగిన జమిలి ఎన్నికల్లో జానీ మాస్టర్ జనసేన పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు.
తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు రావడంతో జానీ మాస్టర్ పీకల్లోతు వివాదంలో కూరుకుపోయారు. దీనికి సంబంధించి ఆయనపై పోక్సో కేసు నమోదయ్యింది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జానీ మాస్టర్‌ను పార్టీకి సంబంధించిన అన్ని కార్యకలాపాలకు దూరంపెడుతున్నట్లు జనసేన ఓ ప్రకటనలో తెలిపింది.