Johnny Master: ఆ రోజు ఎంతో దూరం లేదు.. ఆసక్తికర ట్వీట్ షేర్ చేసిన జానీ మాస్టర్
లైంగిక ఆరోపణల నేపథ్యంలో గత ఏడాది సెప్టెంబర్ 15న జానీ మాస్టర్ పై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇదే కేసులో సెప్టెంబర్ 19న జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుండి కొంతకాలం జానీ మాస్టర్ చంచల్‌గూడ జైల్లోనే ఉన్నారు. జానీ మాస్టర్ కు ఈ కేస్ కారణంగా వచ్చిన నేషనల్ అవార్డును సైతం రద్దు చేశారు. ఆతర్వాత బెయిల్ పై విడుదలయ్యారు.

లైంగిక ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో జైలుపాలైన జానీ మాస్టర్ ప్రస్తుతం బెయిలు పై విడుదలయ్యారు. తిరిగి తన సినిమాలతో బిజీగా మారాడు. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రకరకాల పోస్ట్ లు షేర్ చేస్తున్నారు జానీ. తాజాగా అయన ట్విట్టర్ లో పోస్ట్ పంచుకున్నారు. నిజం తెలుస్తుంది.. న్యాయం గెలుస్తుంది అంటూ జానీ మాస్టర్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
“తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్ల పై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది. ముందస్తుగా నాకు తెలియకుండా జరిగిన యునియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా, నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతూ ఉన్నారు. మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో కానీ అసలు తీర్పు వివరాలు బయటకి వచ్చిన రోజున మీ నిజస్వరూపమేంటో, దేనికోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారని అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు ఎంతో దూరం లేదు. న్యాయమే గెలుస్తుంది, నిజం అందరికీ తెలుస్తుంది!!”అని జానీ మాస్టర్ రాసుకొచ్చారు.
తన అసిస్టెంట్ తో అసభ్యకరంగా ప్రవర్తించారన్న ఆరోపణలను ఎదుర్కుంటున్నారు జానీ మాస్టర్. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిరోజులు జైల్లో ఉన్న జానీ మాస్టర్ ప్రస్తుతం బెయిల్ పై విడుదలయ్యారు. జానీ తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ సాంగ్స్ కు కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరికి కొరియోగ్రాఫర్ గా చేశారు.
తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్ల పై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది.
ముందస్తుగా నాకు తెలియకుండా జరిగిన యునియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా, నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు…
— Jani Master (@AlwaysJani) January 29, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.