రెండో భర్తను పోలీసులకు పట్టించి.. మూడో పెళ్ళికి రెడీ అయిన హీరోయిన్.. ఎవరంటే
ఇండస్ట్రీలో సినిమాలు, వివాదాలతో పాపులర్ అయిన వారు చాలా మంది ఉన్నారు. అలాగే రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు మూడో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు మూడో పెళ్ళికి రెడీ అయ్యింది. అంతే కాదు పెళ్లి పాకిస్థాన్ లో ఉంటుందని తెలిపింది.
![రెండో భర్తను పోలీసులకు పట్టించి.. మూడో పెళ్ళికి రెడీ అయిన హీరోయిన్.. ఎవరంటే](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/actress-72.jpg?w=1280)
సినిమా ఇండస్ట్రీలో ప్రేమ కహానీలు, పెళ్లి తంతులు నిత్యం వార్తల్లో వినిపిస్తూనే ఉంటాయి. కానీ సెలబ్రెటీల వెడ్డింగ్ విడ్డురాలు అన్ని ఇన్ని కాదు. కొంతమంది పెళ్లైన ఏడాదికో, రెండేళ్లలోవిడాకులు తీసుకుంటున్నారు. ఇంకొంతమంది మాత్రం 15 ఏళ్లు, 20 ఏళ్లకు కూడా విడిపోతున్నారు. అలాగే మరికొంతమంది రెండు మూడు పెళ్లిళ్లు చేసుకొని అందరికి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు. తాజగా ఇప్పుడు ఓ హీరోయిన్ మూడో పెళ్లికి రెడీ అయ్యింది. అంతే కాదు పాకిస్థాన్ లో పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మరీ షాక్ ఇచ్చింది. ఆమె రెండు పెళ్లిళ్లు కూడా పెద్ద దుమారాన్నే రేపాయి. రెండో భర్త పై కేసు పెట్టి అరెస్ట్ కూడా చేయించింది ఈ చిన్నది. ఇక ఇప్పుడు మూడో పెళ్లి చేసుకుంటున్నా అని అనౌన్స్ చేసింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
సినిమా ఇండస్ట్రీలో రెండు మూడు పెళ్లిళ్లు చాలా కామన్ అయ్యాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయ్. ఇక ఇప్పుడు మూడో పెళ్ళికి రెడీ అయినా ఆ బ్యూటీ ఎవరో కాదు.. హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకొని ఆతర్వాత వివాదాలతో పాపులర్ అయ్యింది ఆమె రాఖీ సావంత్. ఈ అమ్మడు హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. ఆతర్వాత ఎన్నో కాంట్రవర్సీ కామెంట్స్ చేసి పాపులారిటీ సొంతం చేసుకుంది. హిందీ బిగ్ బాస్ లోనూ పాల్గొంది ఈ చిన్నది.
రాఖీ సావంత్.. మొహబ్బత్ హై మిర్చి నుంచి దేఖ్తా హైతూ క్యా… వరకు పలు పాటలలో కనిపించారు. మాస్టి, మెయిన్ హూ నా, దిల్ బోలే హడిప్ప వంటి సినిమాల్లో ఆమె చిన్న చిన్న పాత్రలు చేసింది. అలాగే నాచి బలియే, పతి పత్ని జౌర్ వో, నాచ్కే దిఖా, బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలలో నటించింది. ఇక ఈ అమ్మడి వ్యక్తిగత విషయాలు కూడా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. రాఖీకి ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. రాఖీ మొదట వ్యాపారవేత్త రితేష్ సింగ్ పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. ఆతర్వాత మరో వ్యక్తిని సీక్రెట్ గా పెళ్లాడింది. కర్ణాటకకు చెందిన కార్త వ్యాపారి అదిల్ ఖాన్ దురానీని పెళ్లి చేసుకుంది. ఈ ఇద్దరు కాపురం ఎక్కువకాలం నిలవలేదు. ఇద్దరి మధ్య గొడవల కారణంగా విడిపోయారు. భర్త పై ఎన్నో సంచలన కామెంట్స్ చేసింది. తరచూ తనను కొట్టాడని, మానసికంగా వేధించారని ఆరోపించింది. దాంతో అతన్ని పోలీస్లు అరెస్ట్ చేశారు. ఇక ఇప్పుడు మూడో పెళ్ళికి రెడీ అయ్యింది. పాకిస్తాన్‌కు చెందిన నటుడు,నిర్మాత డోడి ఖాన్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో రాసుకొచ్చింది రాఖీ సావంత్. పెళ్లి పాకిస్థాన్ లో, రిసెప్షన్ ఇండియాలో హనీమూన్ కి స్విట్జర్లాండ్ లేదా నెదర్లాండ్ వెళ్లనున్నట్టు ఆమె చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.