కుంభమేళాలో అందాల మీదే కెమెరా కళ్లు.. ఇలా తయారయ్యారేంట్రా ??
మహా కుంభమేళా...! ఇదో పరమ పవిత్రమైన వేడుక. భారతీయులందరూ కలిసి కట్టుగా.. గంగా నదిలో పుణ్యస్నానాలాచరించే వేడుక. భారతదేశానికి ఎంతో గర్వకారణమైనదిగా గుర్తింపు పొందినది ఈ వేడుక. అలాంటి ఈ వేడుక ఇప్పుడు అపహాస్యంగా మారుతోంది. దొంగ బాబాలు.. బాబాల వేషంలో దొంగ చేష్టలు..
కెమెరాలు వేసుకుని అమ్మాయిల అందాన్ని రికార్డ్ చేయడాలు.. నెట్టింట వైరల్ చేసి క్యాష్ చేసుకోడాలు..! పూర్తిగా కాకపోయినా ఇది కూడా జరుగుతోంది!.. ఇది కూడా కనిపిస్తోంది ..! 12 సంవత్సరాల తర్వాత ప్రయాగ రాజ్‌లో అత్యంత వైభవంగా ఈ మహా మేళా జరగుతుంటే.. ప్రపంచం మొత్తం కళ్లప్పగించి మరీ మన వేడుక వైపే చూస్తుంటే..! కొంత మంది మాత్రం ఏం చేస్తున్నారు.? మోనాలిసా అనే అమ్మాయి వెంట పడుతున్నారు? అత్యంత రద్దీగా ఉన్న ప్రయాగ్‌లో జల్లడపట్టి మరీ ఆమెనే వెతుకుతున్నారు. ఆమె అందంపై కామెంట్లు చేస్తున్నారు. పిచ్చిగా.. పచ్చిగా… ఆమె పేరుతో వీడియోలు చేసి.. క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే.. వేలం వెర్రితో బరితెగిస్తున్నారు. ఇండియాలో సోషల్ మీడియా కల్చర్ పెరిగింది. ఒప్పుకోవాల్సిందే! అదో ఇన్‌కమ్ జనరేట్ చేసే టూల్‌గా మారింది నిజమే అంటాం! కానీ వ్యూస్ అండ్ లైక్స్ చక్కర్లో ఓ అమ్మాయి జీవితంపై ఎందుకు అంతగా, అతిగా ఫోకస్ చేయాలి? అందంగా ఉందని ఆమె ప్రైవేసీని డిస్ట్రబ్ చేయడం ఏంటి? ఆమె అనుమతి లేకుండా.. వెంట పడి మరీ ఫోటోలు వీడియోలు తీయడాలు.. వైరల్ చేయడాలు ఏంటి?
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పానీపూరి తింటున్నారా ?? అసలు విషయం తెలిస్తే దాని జోలికే పోరు
ఏడాదిన్నరగా పోలీసులకు చిక్కని స్మగ్లర్.. కుంభమేళాలో బుక్కయ్యాడు.. ఎలా అంటే..
Saif Ali Khan: సైఫ్’ కేసులో అరెస్టుతో.. నా జీవితం నాశనం !!
Manchu Lakshmi: వాళ్లు చాలా దురుసుగా ప్రవర్తించారు మంచు లక్ష్మి పోస్టులు వైరల్