Saif Ali Khan: సైఫ్‌’ కేసులో అరెస్టుతో.. నా జీవితం నాశనం !!

Saif Ali Khan: సైఫ్‌’ కేసులో అరెస్టుతో.. నా జీవితం నాశనం !!

Phani CH

|

Updated on: Jan 28, 2025 | 4:55 PM

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై ఇటీవల కత్తితో దాడి చేసిన కేసులో తొలుత అరెస్టయిన అనుమానితుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసులో ఆకాశ్‌ కనోజియా అనే అనుమానితుడిని ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ రైల్వేస్టేషన్‌లో అరెస్టు చేసారు. అయితే పోలీసుల తదుపరి విచారణలో అసలు నిందితుడు ఆకాశ్‌ కాదని తేలడంతో అతడిని వదిలిపెట్టారు.

సైఫ్‌ కేసులో అరెస్టు తర్వాత తన జీవితం సర్వనాశనమైందని ఆకాశ్ తెలిపాడు. డ్రైవర్‌గా పనిచేస్తున్న తాను ఉద్యోగం కోల్పోయాననీ, పెళ్లి సంబంధం చెడిపోవడంతో పాటు తన కుటుంబం ఎన్నో అవమానాలు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేసాడు. సైఫ్‌ కేసులో ప్రధాన అనుమానితుడని చెబుతూ మీడియాలో తన ఫొటోలు వేశారనీ ఫొటోలు చూసిన తమ కుటుంబం షాక్‌కు గురైందనీ అన్నాడు. తనకు కాబోయే భార్యను కలిసేందుకు వెళ్తుండగా దుర్గ్‌లో తనను అదుపులోకి తీసుకొని రాయ్‌పూర్‌కు తరలించారనీ అక్కడికి వచ్చిన ముంబయి పోలీసులు తనపై దాడి కూడా చేశారని ఆకాశ్‌ తెలిపాడు. పోలీసులు విడిచిపెట్టిన తర్వాత ఉద్యోగం కూడా పోయిందని, తనతో వివాహం వద్దని అమ్మాయి తరఫు కుటుంబీకులు నిర్ణయించుకున్నారని చెప్పాడు. అయితే తనపై ఇప్పటికే రెండు కేసులు ఉన్నమాట నిజమేనన్నాడు. ఇటీవల సైఫ్‌అలీఖాన్‌పై ముంబయి బాంద్రాలోని ఆయన నివాసంలోనే దాడి జరిగింది. దొంగతనానికి వచ్చిన దుండగుడ్ని అడ్డుకుంటుండగా అతడు సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన సైఫ్‌ లీలావతి ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుని డిశ్చార్జ్‌ అయి ఇంటికి వచ్చారు. ఈ కేసులో నిందితుడితో దగ్గరి పోలికలు ఉండడంతో పోలీసులు ఆకాశ్‌ను ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో అరెస్టు చేసి తర్వాత నాలిక్కరచుకుని వదిలిపెట్టారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Manchu Lakshmi: వాళ్లు చాలా దురుసుగా ప్రవర్తించారు మంచు లక్ష్మి పోస్టులు వైరల్‌

Budget 2025: బడ్జెట్‌లో ఈ పదాలకు అర్థాలు తెలుసా ??

Budget 2025: బడ్జెట్ నుంచి మిడిల్ క్లాస్ ఏం కోరుకుంటోంది ??

Saif Ali Khan: సైఫ్‌ పై దాడి సమయంలో కరీనా కపూర్ పార్టీలో ఉన్నారా ?? మనుషుల తీరుపై హీరోయిన్ సీరియస్

వామ్మో ఎంత మోసం.. నకిలీ మహిళా ఐఏఎస్ గుట్టురట్టు