వామ్మో ఎంత మోసం.. నకిలీ మహిళా ఐఏఎస్ గుట్టురట్టు
ట్రైనీ ఐ.ఎ.ఎస్. అని చెప్పుకుంటూ పలువురిని మోసం చేసిన కేసులో నిందితురాలు భాగ్యరేఖ, ఆమె భర్త ఎం.చంద్రశేఖర్‌లను వైజాగ్ పోలీసులు అరెస్టు చేశారు. ఎంవీపీకాలనీ పోలీస్ స్టేషన్ లో ఇద్దరిపై నమోదైన కేసులో రిమాండ్‌కు తరలించారు. ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న రౌతు మధును 2015లో చంద్రశేఖర్ పరిచయం చేసుకున్నాడు.
తన భార్య భాగ్యరేఖ బాలల హక్కుల కమిషన్‌లో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్నట్లు పరిచయం చేశాడు. ఈ పేరుతో తయారు చేసిన ఓ నకిలీ గుర్తింపు కార్డు కూడా చూపించడంతో మధు నమ్మాడు. పైనాపిల్ కాలనీలో టిడ్కో ఇళ్లు ఇప్పిస్తానని పలు దఫాలుగా రూ.80వేలు తీసుకున్నారు. అలాగే రమ అనసూయ అనే మహిళతో జీవీఎంసీˆ కమిషనర్‌గా పరిచయం చేసుకుని రూ.లక్ష వరకు తీసుకున్నారు. అయితే ఎలాంటి ఇళ్లు ఇవ్వకపోవడంతో బాధితులు నిలదీశారు. దీంతో వారిపై దొంగతనం కేసు పెడతానని భాగ్యరేఖ బెదిరింపులకు దిగింది. బాధితులు భాగ్యరేఖ, ఆమె భర్త చంద్రశేఖర్‌లపై ఈనెల 22న ఎంవీపీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణలో పోలీసులు భాగ్యరేఖని నకిలీ ఐ.ఎ.ఎస్.గా గుర్తించారు. ఫిర్యాదు అందిందని తెలియగానే వీరిద్దరూ పరారయ్యారు. వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒంగోలు వద్ద అదుపులోకి తీసుకుని విశాఖ తీసుకువచ్చారు. నిందితురాలు భాగ్యరేఖ గతంలో ఇలాగే కంచరపాలెం పరిధిలో కూడా పలువురిని మోసం చేసినట్లు కేసులు నమోదయ్యాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాబాయ్‌కి పద్మభూషణ్‌పై అబ్బాయిల రియాక్షన్
అసలేంటీ డ్రోన్ సిటీ ?? సీఎం చంద్రబాబు లక్ష్యం ఇదేనా
7 నెలల కిందట పెళ్లి.. భార్య గర్భవతి.. ఇంతలోనే సూసైడ్ లెటర్.. అసలేమైంది ??
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నుంచి వింత శబ్దాలు.. దగ్గరికెళ్లి చూసిన స్థానికులకు షాక్ !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

