7 నెలల కిందట పెళ్లి.. భార్య గర్భవతి.. ఇంతలోనే సూసైడ్ లెటర్.. అసలేమైంది ??
వందలు, వేలతో మొదలైన మాయాజూదం..చూస్తుండగానే లక్షలకు చేరుతోంది. ఆపై అప్పుల ఊబిలో చిక్కుకుని.. జేబులు గుల్లవుతాయి. అత్యాశతో కొందరు.. వ్యసనాల బారిన పడి మరికొందరు..ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడి నిండు జీవితాలను బలిచేసుకుంటున్నారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన నిరంజన్ వలి అనే యువకుడు ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.
మంచి జీతం.. జీవితం బాగానే ఉందనుకున్న సమయంలో బెట్టింగ్ యాప్‌లకు బానిస అయ్యాడు. అందులో పూర్తిగా కూరుకుపోయి సూసైడ్ లెటర్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బెట్టింగ్ యాప్ ద్వారా 13 లక్షల రూపాయలు పోగొట్టుకోవడంతో తాను సూసైడ్ చేసుకుంటున్నానంటూ 6 పేజీల లెటర్ రాసి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఇంటి నుండి పోయాడు. దీంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు బంధువులు.. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ యువకుడు రాసిన లెటర్ ప్రకారం బెట్టింగ్ యాప్ లకు బానిసను అయ్యానన్నాడు. బెట్టింగ్ వల్ల అప్పులు చేయడంతో గతంలో పలుమార్లు తన తండ్రి ఆ అప్పులను తీర్చారని రాసుకొచ్చాడు. మళ్లీ అప్పులు చేశానని.. అందుకే తన తండ్రికి మొహం చూపించలేకే వెళ్లిపోతున్నట్లు తెలిపాడు. తనకు జైలు శిక్ష పడుతుందని, ఈ బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని రాశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నుంచి వింత శబ్దాలు.. దగ్గరికెళ్లి చూసిన స్థానికులకు షాక్ !!
చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్..! వీటిని అస్సలు తినకూడదట!
దారుణం.. సంతలో అద్దెకు యువతులు, మహిళలు!
ఇక వారానికి నాలుగు రోజులే పని !! వచ్చేస్తోంది కొత్త లేబర్ కోడ్

మోటారు లేకుండానే ఉబికి వస్తున్న గంగ

కారును రైల్వే ప్లాట్‌ఫామ్‌పైకి పోనిచ్చి.. ఆ పై పట్టాల మీద పడి ??

భర్త కిడ్నీ అమ్మి.. ఆ డబ్బుతో ప్రియుడితో పరార్

పక్కింటి అమ్మాయిని వీడియో తీసిన యువకుడు.. ఆ తర్వాత ??

గ్రీన్ టీ తాగేవారికి అలెర్ట్.. వామ్మో ఇన్ని సమస్యలా..!

నాలుక కోసి శివలింగానికి సమర్పించుకుంది.. చివరకు..

చైనాపై ఆంక్షలు.. ఆ పార్సిళ్లు కూడా బంద్
