కేంద్రం గుడ్‌ న్యూస్..! రూ.10 లక్షల వరకూ నో ట్యాక్స్ ?

కేంద్రం గుడ్‌ న్యూస్..! రూ.10 లక్షల వరకూ నో ట్యాక్స్ ?

Phani CH

|

Updated on: Jan 27, 2025 | 5:28 PM

ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుందా..? ఈ సారి బడ్జెట్‌తో ఉద్యోగుల ముఖాలు వెలిగిపోతాయా..? రెండు రోజులుగా ఇదే చర్చ జరుగుతోంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు మరో వారం రోజులు గడువు మాత్రమే ఉంది. ఏటా బడ్జెట్ పెట్టే ముందు రకరకలా అంచనాలుంటాయి.

ముఖ్యంగా ఇన్‌కమ్ ట్యాక్స్ విషయంలో చాలా ఆశలుంటాయి. ఈసారి శ్లాబ్‌లలో ఏమైనా మార్పు తీసుకొస్తారా..? ఇంకేదైనా తాయిలం ఇస్తారా అని ఎదురు చూస్తుంటారు. అయితే…కొన్ని సోర్సెస్ ఆధారంగా తెలుస్తున్న సమాచారం ప్రకారం..ఈ సారి పద్దులో ఉద్యోగులకు తీపి కబురు చెప్పనుంది. ముఖ్యంగా ఐటీ శ్లాబ్‌లలో కీలక మార్పులు తీసుకొచ్చే అవకాశముందని ప్రచారం గట్టిగానే జరుగుతోంది. అదేంటంటే…10 లక్షల ఆదాయం వరకూ ప్రభుత్వం ఎలాంటి పన్ను విధించకూడదనే ఆలోచన చేస్తోంది. అయితే..ఇందుకు బదులుగా 25% అనే కొత్త శ్లాబ్‌ని తీసుకు రానుందనీ సమాచారం. 15 లక్షల నుంచి 20 లక్షల ఆదాయం ఉన్న వాళ్లు ఈ 25% శ్లాబ్‌ పరిధిలోకి వస్తారనీ అంటున్నారు. ఇందులో నిజమెంత అన్నది తెలియకపోయినా ఇప్పటికైతే అంతా ఇది..నిజమైతే బాగుండు అని కోరుకుంటున్నారు. ఇక మరో ప్రచారం ఏంటంటే…ప్రభుత్వం రెండు ఆప్షన్స్ పెట్టుకుందట. 10 లక్షల ఆదాయం ఉన్న వాళ్లపై పన్ను విధించకపోవడం ఒకటైతే..కొత్తగా 25% శ్లాబ్ తీసుకురావడం మరోటి. ప్రస్తుతమున్న శ్లాబ్‌ల ఆధారంగా చూస్తే…ఏడాదికి 15 లక్షల రూపాయల ఆదాయం దాటిన వాళ్లను 30% శ్లాబ్‌లో చేర్చింది ప్రభుత్వం. అయితే..ఇలా మార్పులు చేయడం వల్ల దాదాపు లక్ష కోట్ల వరకూ ప్రభుత్వానికి నష్టం వాటిల్లే అవకాశముంది. అయినా ప్రభుత్వం ఉద్యోగులకు ఊరటనిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతానికి జీడీపీ వృద్ధి రేటు కాస్త మందగించింది. ద్రవ్యోల్బణమూ ఇంకా దారిలోకి రావాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలంటే ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పదని కేంద్రం భావిస్తోందని చెబుతున్నాయి విశ్వసనీయ వర్గాలు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉత్తరాఖండ్‌లో అమలులోకి వచ్చిన ఉమ్మడి పౌరస్మృతి

కొలంబియా యూటర్న్‌.. ట్రంప్‌ నిబంధనలకు ఓకే

కుంభమేళా చుట్టూ చిట్టడవి.. స్వచ్ఛమైన గాలికి కొదవే లేదు..

శివ శంకర్‌గా మారిన సద్దాం హుసేన్.. ప్రియురాలి కోసం హిందువుగా

అక్షయ్ సినిమాపై వివాదం భగ్గుమంటున్న ఆ వర్గం